సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. తాజాగా బాలీవుడ్ కు చెందిన నటి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ ‘ఈషా గుప్తా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వర్గం – 2, గోరి తేరే ప్యార్ మే, యార్ ఇవాన్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఏక్ బార్ ఏక్ బార్ ‘ పాటలో దుమ్మురేపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. తన అందాలతో రచ్చ చేస్తుంది. తాజగా ఈషా గుప్తా.. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫొటో షేర్ చేసి అందరికి షాకిచ్చింది. అందులో ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించింది. అంతే కాకుండా ‘హైపర్బేరిక్ థెరపీ’ అని క్యాప్షన్ కూడా జత చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.అయితే.. ఈషా గుప్తా “మయోసైటీస్” అనే వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. గతంలో సమంత కూడా ‘మయో సైటీస్’ అనే అరుదైన వ్యాధికి గురైంది. అప్పుడు సమంత కూడా హైపర్బేరిక్ థెరపీ తీసుకున్న విషయం తెలిసిందే.
హైపర్బేరిక్ థెరపీ వల్ల పాడైన కండరాలు బాగుపడతాయి. కండరాలలో వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని సామ్ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు అలాంటి అక్సిజన్ మాస్క్‌తో నే ఈషా కనిపించడంతో ఈమెకి మయేసైటిస్ వ్యాధి వచ్చిందా అని నెటిజన్స్ కు సందేహం కలుగుతుంది. “ఆటో ఇమ్యున్” సమస్య కారణంగా వచ్చే వ్యాధి మయోసైటిస్. దీని వల్ల భుజాలు, కడరాలలో నొప్పి కలుగుతుంది. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడటం గమనార్హం. ఎదేమైనా స్టార్ హీరోయిన్స్ అంత ఇలా కొత్త రకం వ్యాధులకు గురవడం.. వాళ్ల ఫ్యాన్స్‌కి బాధకరమైన విషయం అని చెప్పోచ్చు. మరి.. హీరోయిన్స్ ఒక్కొకరుగా ఇలా అనారోగ్యానికి గురి అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.