'మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రచారాలు చేసిన మారే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందంట. మందు, బీర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది అంటుంటారు. అది వాస్తవామే కానీ.. బీర్ తాగే అలవాటు ఉంటే మాత్రం కొన్ని వ్యాధులు మీ దరి చేరవు.
‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రచారాలు చేసిన మారే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందంట. అలానే మద్యం తాగి ఇంటికి వెళ్తే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. మద్యం, బీర్ తాగడం వలన ఆరోగ్యం పాడైపోతుందని కుటుంబ సభ్యులు చెప్తుంటారు. అయితే కేవలం బీర్ మాత్రమే తాగే వారి విషయంలో ఆ ఆలోచన తప్పంట. మితంగా బీర్ తాగితే ఆరోగ్యానికి మంచిదంట. బీర్ మితంగా తీసుకుంటే అది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు పరీశోధకులు సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో బీర్ తాగే వారిపై పరిశోధకులు అధ్యాయనం చేశారు. ఆమ్ స్టర్డామ్ యూనివర్శిటీకి చెందిన నిపుణులు ప్రొఫెసర్ ఎరిక్ క్లాస్సెన్ ఈ అధ్యయనానికి సంబంధించి వివరణ ఇచ్చారు. బీర్ తాగే వారి విషయంలో ముఖ్యంగా మితంగా బీర్ తాగే వారికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. బీర్ తాగడం వలన ఒత్తిడి, భయం, అలసట వంటి వాటి నుంచి బయట పడొచ్చని పరిశోధకులు అంటున్నారు.
అయితే దీనిని 350 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకూడదని కూడా సూచిస్తున్నారు. అంతేకాక ఈ బీర్ కొన్ని రకాల వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుందంట. ఈ బీర్ లో రెట్టింపు కిణ్వ ప్రక్రియతో వచ్చే పొంగు నుంచి స్ట్రాంగ్ బీర్ తయారువుతుందని, ఇదెంతో ఆరోగ్యకరమైనదిగా ఆమ్ స్టర్డార్ యూనివర్సిటీ పరిశోధకలు తెలిపారు. అయితే ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో బీరు తాగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉందంట. ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమైన బ్యాక్టీరియాను ఇది నిర్మూలిస్తుంది.
కొన్ని ప్రోబయోటిక్స్ సాయంతో శరీరంలోని కొవ్వును కరిగిస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. బీర్ తాగడం వలన మీ శరీరంలోని కేలరీలను తగ్గిస్తుందంట. ఇది జీర్ణ ప్రక్రియ సమయంలో తీసుకున్న ఆహారం నుంచి కేలరీలను ఖర్చు అయ్యేలా చేస్తాయ. అతిగా ఆల్కాహాల్ సేవించినా కూడా మొత్తానికే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరి… బీర్ విషయంలో పరిశోధకులు వెల్లడించిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.