ఆరోగ్య నిపుణులు 40 ఏళ్లు పైబడిన మహిళల కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమైన ఆరోగ్య సూచనలు చెబుతూనే ఉన్నారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవని చెబుతుంటారు. సరిగ్గా ప్రతి రోజు డైట్ ని తీసుకోవడం ప్రతి మహిళ తప్పక చేయాలి. తాజాగా బ్లడ్ షుగర్ లెవల్స్.. ఎలాంటి ఆహారం తీసుకుంటే కంట్రోల్ లో ఉంటాయో నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలు మీకోసం..
గ్రీన్ టీ: ఈ మధ్య కాలంలో గ్రీన్ టీని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కాఫీ, టీకి బదులుగా మీరు గ్రీన్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
యాపిల్: యాపిల్ ని రోజుకి ఒకటి తీసుకుంటే వైద్యానికి దూరంగా ఉండొచ్చనే సంగతి అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల తర్వాత పురుషులు గానీ, స్త్రీలు గానీ ప్రతిరోజు ఫుడ్ లో సీజనల్ ఫ్రూట్స్ తింటే మంచిది. అందులోనూ అన్ని పండ్ల కంటే యాపిల్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు: ప్రోటీన్స్ అనేవి శరీరానికి ఎంతో అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తప్పక తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు తమ బరువులో ఒక్కో కిలో గ్రామ్ బరువుకి 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి: ఈ మధ్య పిల్లల నుండి పెద్దల వరకూ జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. బయట దొరికే జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తప్ప ఏ మేలు ఉండదు. జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్‌కి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి.
మెంతులు: మామూలుగా ఆడవాళ్లు మెంతులను అనేక వంటల్లో వాడుతుంటారు. నిజంగానే మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన ఆడవాళ్లు మెంతులు తీసుకుంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క: ఇది వంటలకు చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. కేక్, పాన్ కేక్ వంటి వాటిలో కూడా దాల్చినని వాడతారు. దీనివల్ల వంటలకు మంచి రుచి వస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.