Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు అని చాలా మంది భక్తులకి సందేహం ఉంది. ఆగస్ట్ 5న అని కొందరు, ఆగస్ట్ 12న అని కొందరు అంటున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. కానీ ఈసారి జూలై 29వ తేదీన శ్రావణ శుక్రవారం ప్రారంభం కావడంతో కొందరేమో ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలని.. మరికొందరు ఆగస్టు 12వ తేదీన నిర్వహించాలని చెబుతున్నారు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏ తేదీలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలి? ఏ శుభ ముహూర్తాన చేసుకోవాలి? అనే వివరాలు మీ కోసం.
పండితుల లెక్కల ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలి. ఆ లెక్కన ఆగస్ట్ 5న అంటే రెండవ శుక్రవారం నాడు వ్రతం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆరోజు వ్రతం చేసుకోవడం కుదరని వారు ఆగస్ట్ 12న చేసుకోవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా ఈ వ్రతం చేసుకోవచ్చు. చాలా మంది మహిళలు పలనా శుక్రవారం నాడు వ్రతం చేయడం కుదరనప్పుడు ఈ నెలలో ఏదో ఒక శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఆగస్ట్ 12న శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు ఉదయం 8 గంటల లోపు పౌర్ణమి తిథి ముగుస్తుంది. ఆ వెంటనే పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. అంటే ఆగస్ట్ 12న వరలక్ష్మీ వ్రతమ చేసుకుంటే అమావాస్య ముందు రోజు వచ్చే శుక్రవారం అవుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని పండితులు చెబుతున్నారు.
ఇక వరలక్ష్మీ వ్రతం ఏ ముహూర్తంలో చేసుకోవాలి?
వరలక్ష్మీ వ్రత ధర్మ సందేహాల పరిష్కారాల కోసం ఈ కింది వీడియో చూడండి: