ఈ ఏడాది మే నెల 5వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి చంద్రగ్రహణం చాలా విశిష్టమైనది అంటున్నారు పండితులు. కారణం చంద్రగ్రహణం నాడే బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది. 130 ఏళ్ల తర్వాత ఇలా రెండు కలిసి వస్తున్నాయని.. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక యోగం ఏర్పడనుంది అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
వైశాఖ మాసం.. బౌద్ధులకు అత్యంత ముఖ్యమయిన నెల. కారణం గౌతమ బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజునే జన్మించాడు. అందుకే ఆ రోజున బౌద్ధులు బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది బుద్ధ పూర్ణిమకు ఎంతో విశిష్టత ఉంది. ఇది బౌద్ధులకు మాత్రమే కాక.. హిందువులకు కూడా ప్రత్యేకంగా ఉండబోతుంది. కారణం.. ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ రోజునే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న అనగా శుక్రవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. అయితే బుద్ధ పూర్ణిమ, చంద్రగ్రహణం కలిసి వస్తుండటంతో.. ఇది ఎంతో ప్రత్యేకమైనది అని.. సుమారు 130 ఏళ్ల తర్వాత ఇలా చంద్రగ్రహణం, బుద్ధ పూర్ణిమ కలిసి వస్తున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక యోగం ఏర్పడనుంది అంటున్నారు పండితులు. ఫలితంగా వారు డబ్బు, సంపద, కీర్తి, అదృష్టం పొందుతారు అంటున్నారు పండితులు. మరి ప్రత్యేక యోగం పొందే ఆ రాశులు ఏవి అంటే..
బుద్ధ పూర్ణిమ నాడే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆ రోజున సూర్యుడు మేష రాశిలో సంచరిస్తూ బుధ గ్రహంతో కలిసి ఉంటాడు అంటున్నారు పండితులు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుందని.. ఇది మేశ రాశి వ్యక్తులకు చాలా శుభప్రదంగా ఉంటుందని అంటున్నారు పండితులు. ఈ ప్రత్యేక యోగం వల్ల మేశ రాశి వారికి సంపదలో పెరుగుదల ఉంటుంది అంటున్నారు. ఈ రాశి వారు గనక ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే.. వారికి ఈ సమయం కలిసి వస్తుందని అంటున్నారు. వ్యాపారంలో లాభాలతో పాటు.. ఈ ప్రత్యేక యోగం వల్ల ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయని అంటున్నారు.
ప్రత్యేక యోగం పొందే రాశుల్లో కర్కాటక రాశి కూడా ఉంది. వీరు కూడా సూర్యుడు, బుధుని కలయిక వలన కూడా అనుకూల ఫలితాలు పొందుతారు అంటున్నారు పండితులు. ఈ సమయంలో కర్కాటక రాశి వ్యక్తులు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారని.. కెరీర్‌లో భారీ విజయం సాధిస్తారని.. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పండితులు. ఉద్యోగస్తులు బదిలీ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే.. కోరుకున్న ప్రదేశంలో బదిలీ పొందవచ్చు.
ఈ ఏడాది చంద్రగ్రహణం సందర్భంగా ఏర్పడే ప్రత్యేక యోగం కారణంగా సింహ రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది అంటున్నారు పండితులు. బుధాదిత్య యోగం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు. ఈ యోగం కారణంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ లభిస్తుందని.. జీవితంలో ఆనందం ఉంటుందని.. ఈ సమయంలో జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది అని తెలుపుతున్నారు. ఈ రాశులు వారు ప్రస్తుతం చేస్తోన్న వృత్తిలో విశేష అవకాశాలు లభిస్తాయని.. వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందుతారని అంటున్నారు పండితులు.