శ్రావణ మాసం అంటే శ్రవణ సంబంధమైన మాసం. వెంకటేశ్వరస్వామి వారి నక్షత్రం.. శ్రవణ నక్షత్రం. స్వామివారికి అమ్మవారు నిత్యానపాయిని. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా ఆయనను విడిచి అమ్మవారు ఉండదు. అందుకే అమ్మవారిని ‘నిత్యానపాయిని’ అంటారు.
శ్రీ మహావిష్ణువు యొక్క 23 అవతారాల్లో ఎనిమిదవ అవతారమే శ్రీ కృష్ణావతారం. శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవుడు దంపతులకు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి నాడు(8వ రోజున) కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీ కృష్ణుడి పుట్టినరోజునే కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి రోజునే రోహిణి నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. నక్షత్రాలు, తిథులని బట్టే పూర్వం పుట్టినరోజులు, […]
Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు అని చాలా మంది భక్తులకి సందేహం ఉంది. ఆగస్ట్ 5న అని కొందరు, ఆగస్ట్ 12న అని కొందరు అంటున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. కానీ ఈసారి జూలై 29వ తేదీన శ్రావణ శుక్రవారం ప్రారంభం కావడంతో కొందరేమో ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలని.. మరికొందరు ఆగస్టు 12వ […]
Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ అంటే శ్రేష్ఠమైన లక్ష్మీ అని అర్ధం.శ్రేష్ఠమైన లక్ష్మీదేవి కోసం చేసే వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కీర్తి, ఐశ్వర్యం, సంపద పెరుగుతాయని చాలా మంది నమ్మకం. లక్ష్మీదేవి అంటే ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, జ్ఞాన సంపద, గుణ సంపద వంటి సంపదలను అందించే దేవత. వరలక్ష్మీ వ్రతం రోజున పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. […]
నాలుగో శ్రావణ శుక్రవారం. పెళ్లైన మహిళలు చాలా ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ఈ నెల చాలా ప్రాముఖ్యం. శ్రావణ మాసం అంటేనా అందరికీ ముందుగా గుర్తుకొచ్ఛేది. “వరలక్ష్మీ వ్రతం”. ఈ వరలక్ష్మీ వ్రతం తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ఉపవాసం మొదలు పూజలు […]
శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా ఈ రోజు ప్రేమ, సౌందర్య దేవుడిగా పరిగణించే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. వీరిద్దరినీ శుక్రవారం నాడు ఆరాధించడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరగడమే కాకుండా సంపద, ప్రేమ లాంటివి పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజ చేస్తే మంచిది. సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. శుక్రవారం రాత్రి ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే […]
స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. స్త్రీలు తమ సౌభాగ్యాన్నిసమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలో నైన , దేవాలయంనకు వెళ్లినప్పుడైన తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ ఒకటి. ఈ ఏకాదశి రోజున […]
సర్వమంగళ స్వరూపిణీ అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా […]
‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమ శివుడు. ‘యశ్చ శ్రవణ మాత్రేణ సిద్ధిదః శ్రావణోప్యతః’ మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే ఫలితం కలుగుతుంది. శ్రావణంలో శివుడి ప్రాశస్త్యాన్ని శ్రవణంతోనే సకల కార్యాలు నెరవేరుతాయని చెబుతుంది స్కాంద పురాణం. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. […]
శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. […]