శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా ఈ రోజు ప్రేమ, సౌందర్య దేవుడిగా పరిగణించే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. వీరిద్దరినీ శుక్రవారం నాడు ఆరాధించడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరగడమే కాకుండా సంపద, ప్రేమ లాంటివి పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజ చేస్తే మంచిది. సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. శుక్రవారం రాత్రి ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వసిస్తారు.
ఆవులకు పచ్చని గడ్డి ఆహారం తినిపిస్తే మంచిదని నమ్ముతారు. శుక్రవారం రోజు ఆహారం తీసుకునే ముందు నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. శుక్రవారం రాత్రి పడనుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లేపూల సుగంధం లేదా మల్లేపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొంద వచ్చు. ఫలితంగా డబ్బుకు ఇంట్లో కొరతే ఉండదు.
శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగులో కాగితంలో ఉంచుకొని మీ పర్సులో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది.