శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి.
పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం, పూజ, ఉపవాసం తదితర ఆచారాలు మనదగ్గర ఏర్పడ్డాయి. ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.
శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడ, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రావణమాసం మొదలైంది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది.
నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం.
మరిన్ని వివరాలకోసం ఈ వీడియో వీక్షించండి: