స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. స్త్రీలు తమ సౌభాగ్యాన్నిసమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలో నైన , దేవాలయంనకు వెళ్లినప్పుడైన తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ప్రతి రోజూ ఓ వ్రతం, ప్రతి వారం విశేష సారం ప్రతి ఇంటా సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీనదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణ మాసం. ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునే వాయనాలు, పుచ్చుకునే వాయనాలు, గుప్పిట పట్టినన్ని శనగలు ఇలా ఇంటింటా లక్ష్మీదేవి కళకళలాడుతుంది.
ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది. ‘శ్రావణం నా రూపం’ అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే “శ్రావణ మాసం“. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి.
ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.