ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5 అనగా శుక్రవారం రోజున ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం కారణంగా 4 రాశుల వారికి కలిసి రాదని.. వారు కొన్ని పరిహారాలు పాటించాలి అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం నేడే ఏర్పడనుంది. అయితే ఈ చంద్రగ్రహణానికి చాలా ప్రత్యేకత ఉంది. కారణం నేడే బుద్ధ పూర్ణిమ కూడా. 130 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం, బుద్ధ పూర్ణిమ కలిసి వస్తున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి విశిష్ట యోగం కలుగుతుంది అంటున్నారు. అయితే నిజానికి ఈ సంవత్సరం ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కావున విదేశాల్లో ఉన్న భారతీయులు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తద్వారా చంద్రగ్రహణ ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. జనాలు ఇంటి నుంచి బయటకు వెళ్లరు. ఆలయాలు మూసి వేస్తారు. అంతేకాక గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి అంటారు పెద్దలు. మరీ ముఖ్యంగా గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచిస్తారు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అంటారు. గర్భిణీలు గ్రహణం విడిచేవరకు ఏ పని చేయకుండా పడుకుని ఉంటే మంచిది అని చెబుతారు.
చంద్రగ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉండాలని శాస్త్ర నిపుణులు అంటున్నారు. గ్రహణ కాలంలో మీరు ఎవరితోనైనా కోపం తెచ్చుకుంటే, రాబోయే 15 రోజులు మీకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుందని సూచిస్తున్నారు. అంతేకాక గ్రహణ సమయంలో నిర్జన భూమి, స్మశానవాటిక వైపు వెళ్లవద్దు అంటున్నారు. అలా చేస్తే జీవితంలోని ఆనందం శాశ్వతంగా పోతుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణం సమయంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం నాలుగు రాశుల వారికి చాలా ప్రమాదం అని అంటున్నారు పండితులు. వారు చెడు ఫలితాలు చవి చూస్తారని చెబుతున్నారు. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే గ్రహణం విడిచాక.. తప్పకుండా కన్ని పరిహారాలు చేయాలని.. లేదంటే ఏలినాటి శని పట్టడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు. మరి ఈ గ్రహణం ఏ రాశి వారికి కలిసి రావడం లేదు.. వారు పాటించాల్సిన పరిహారాలు ఏవి అంటే..
చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే ఈ రాశి వారు ఆంజనేయుడు స్వామి గుడికి వెళ్లి దీపం పెట్టాలి అని సూచిస్తున్నారు. లేదంటే ఈ సంవత్సరం అంతా శని మీ నట్టింట తాండవిస్తుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు.
చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే సింహరాశి వారు.. సమీపంలోని పాము పుట్ట వద్దకు వెళ్లి పంచదార వేసి కొబ్బరికాయ కొట్టి 11 ప్రదక్షిణలు చేయాలి. లేకపోతే ఈ సంవత్సరం భారీ ధన నష్టం వచ్చే అవకాశం ఉందంటున్నారు పండితులు.
చంద్రగ్రహణం పూర్తయిన తరువాతి రోజు కన్యా రాశి వారు శివాలయానికి వెళ్లి, కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో దీపం వెలిగించి.. పంచాక్షరి మంత్రం పఠించాలని సూచిస్తున్నారు. లేకపోతే ఈ సంవత్సరం చాలా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటున్నారు.
చంద్రగ్రహణం పూర్తయిన తెల్లవారే మీన రాశి వారు.. ఆంజనేయుడు గుడికి వెళ్లి మినప్పప్పు తో చేసిన వడలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అని పండితులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇది రాత్రి తర్వాత 8:44 నుండి 1:20 వరకు ఉంటుంది. గ్రహణం ముగిసిన తరువాత, ఇంటిని శుద్ధి చేసి, పేదవారికి దాన ధర్మాలు చేయాలి అంటున్నారు.