మే 5న అనగా శుక్రవారం వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
ఈ ఏడాది మే నెల 5 వ తేదీన తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. 130 ఏళ్ల తర్వాత వైశాఖ పూర్ణిమ రోజున ఈ గ్రహణం ఏర్పడుతుండటంతో.. చాలా ప్రత్యేకం అంటున్నారు పండితులు. మే 5న అనగా శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. ఇక గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు నుంచి సూతకం అనగా అశుభ గడియలు ప్రారంభమై గ్రహణం ముగియడంతో ముగుస్తాయి. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసేస్తారు. గర్భిణులు బయటకు రాకూడదని, నేరుగా ఎవ్వరూ గ్రహణం వీక్షించకూడదని, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని చెబుతారు పెద్దలు. అయితే ఈ ఏడాది ఏర్పడుతున్న తొలి చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కేవలం యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్ , హిందూ మహాసముద్రంలో ఇది కనపడుతుంది.
ఈ గ్రహణ ప్రభావం భారతదేశంలో కనిపించకపోయినా.. గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి అంటున్నారు పండితులు. కొన్ని పనులు చేయకూడదు అంటున్నారు. అవేంటంటే..