ఈ ఏడాది మేలో తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుంది. చంద్రగ్రహణం సందర్భంగా పలు రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆ వివరాలు..
ప్రతి ఏటా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం సహజం. హిందూ మతంలో గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. ఆ రోజున ఆలయాలు కూడా మూసి వేస్తారు. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం చేయరు. గ్రహణ ప్రభావం నుంచి కాపాడుకోవడం కోసం గరికను అన్ని ఆహార పదార్థాలు, నీటిలో వేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత.. ఇంటిని శుభ్రం చేసుకుని.. తల స్నానం చేస్తారు. గ్రహణం వేళ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. 2023లో 20వ తేదీన తొలి సూర్య గ్రహణం ముగిసింది. అయితే ఇది మన దేశంలో కనిపించలేదు. ఇక మే నెల 5వ తేదీన అనగా శుక్రవారం రాత్రి 8:45 గంటలకు మొదటి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మరుసటి రోజు అంటే శనివారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో గ్రహణం ముగియనుంది.
ఇక జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, సూర్య, చంద్ర గ్రహణాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి అంటారు పండితులు. ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్ర గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం ఉందని.. శుభవార్తలు వింటారని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం కారణంగా నాలుగు రాశుల వారికి ధన యోగం పట్టనుందని తెలిపారు పండితులు.. మరి ఆ నాలుగు రాశులు ఏవి అంటే..
ఈ ఏడాది మే నెలలో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం వల్ల మేశ రాశి వారికి విశేష ఫలితాలు రానున్నాయి అంటున్నారు పండితులు. ముఖ్యంగా వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలొస్తాయని.. ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీ, ప్రమోషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలను వింటారు అని అంటున్నారు పండితులు.
ఈ సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్ర గ్రహణం వల్ల మేలు జరిగే నాలుగు రాశుల్లో మిధున రాశి ఒకటి అంటున్నారు పండితులు. చంద్రగ్రహణం వల్ల.. ఈ రాశి వారికి మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిపారు పండితులు. వీరి ఆదాయం పెరగడమే కాక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని.. విదేశీయానం చేసే అవకాశం ఉందని అంటున్నారు పండితులు.
సింహ రాశి వారికి మొదటి చంద్ర గ్రహణం వల్ల సానుకూల ఫలితాలు కలగనున్నాయి అంటున్నారు పండితులు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రాశి వారికి ఇదే సమయం మంచి సమయమని.. వారి లక్ష్యాలను నెరవేర్చడానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే కలిసి వస్తుందని తెలుపుతున్నారు. అలానే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు పూర్తి అంకితభావంతో పని చేస్తే కచ్చితంగా విజయావకాశాలు పెరుగుతాయి అంటున్నారు. ఈ కాలంలో ఈ రాశి వారికి సంబంధించిన కోర్టు కేసు సంబంధిత విషయాల్లో వారికి అనుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ ఏడాది మే మాసంలో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం వేళ మకర రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి అంటున్నారు పండితులు. ఈ కాలంలో మకర రాశి వారికి శని దేవుని అనుగ్రహం లభిస్తుందని తెలుపుతున్నారు. వీరి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలొస్తాయని.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. చంద్ర గ్రహణం కాలంలో వీరి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని.. అలానే సమాజంలో వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అంటున్నారు. ఈ రాశి ఉద్యోగులకు పని చేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయని తెలుపుతున్నారు పండితులు.