ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ అయ్యప్ప స్వామి గురించి.. ఆయన పుట్టుక గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు.. రాష్ట్రంలో పెను వివాదాన్ని రాజేశాయి. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి చెబుతూ.. భైరి నరేష్.. అత్యంత జుగుప్సకర వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వంటి వారు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు మీకు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి తెలుసా.. సరిగ్గా చదివారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే అయ్యప్ప స్వామి హరిహరసుతుడా.. ఆయన పుట్టుక ఎలా చోటు చేసుకుంది.. దాని వెనక ఉన్న పరమార్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హరిహరసుతుడిగా అయ్యప్ప స్వామిని కొలుస్తారు. హరికి, హరుడికి జన్మించాడు అయ్యప్ప స్వామి. ఇలా ఎందుకు జరిగింది అంటే.. పూర్వం.. మహిషి అనే రాక్షసి.. తనకు చావులేకుండా వరం ప్రసాదించమని బ్రహ్మ దేవుడిని కోరుతుంది. అందుకు బ్రహ్మ.. అది అసాధ్యం అంటాడు. అప్పుడు.. మహిషి.. అయితే హరి, హరుడు అంటే శ్రీమహావిష్ణువు, శివుడు.. ఇద్దరకి జన్మించిన పుత్రుడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించాలని వరం కోరుతుంది. మరి ఇలా ఎక్కడైనా జరుగుతుందా.. లేదు. కానీ లోక కళ్యాణం జరగడం కోసం.. మహిషిని అంతం చేయడం కోసం.. హరిహరులకు కుమారుడు జన్మించాలి. అలా జరగాలంటే.. శ్రీ మహావిష్ణువు స్త్రీరూపం ధరించాలి. మహిషి అంతం కోసమే.. నాడు క్షీర సాగర మధనం సందర్భంగా శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం ధరించాడు.
ఇక అమృతం కొరకు దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధించారు. ఆ సమయంలో ముందుగా.. హాలహలం అంటే విషం బయటకు వచ్చింది. అది చూసి అందరూ భయపడతారు. మరి ఆ విషాన్ని భరించే శక్తి ఎవరికి ఉంది అంటే.. శంకరుడికి. దాంతో ఆయన లోకాన్ని కాపాడటం కోసం ఆ విషాన్ని స్వీకరించాడు. ఆ వేడిని తట్టుకోలేక.. తన కంఠంలో బంధించాడు. ఆ తర్వాత అమృతం లభించింది. దాని కోసం దేవతలు, రాక్షసులు మాకు కావాలంటే.. మాకు అంటూ వాదులాడుకోసాగారు. అమృతం రాక్షసులు చేతికి చిక్కితే.. ఇక ఈ లోకం అల్లకల్లోలం అవుతుంది. మరి పరిష్కారం ఏంటి అంటే..
ఆ సమయంలో జగన్మాత ఆదేశాల మేరకు.. శ్రీమహావిష్ణువు.. అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహని అవతారం ఎత్తుతాడు. ఆమె అందం చూసి ప్రతి ఒక్కరు ముగ్ధులవుతారు.. మైమరచిపోయి చూస్తుంటారు. అలా రాక్షసులను తన మాయలో బంధించి.. అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేస్తాడు విష్ణువు. ఆ పని పూర్తయిన తర్వాత.. మోహిని అవతారం చాలించే సమయంలో.. శివుడు.. ఆమెను చూసి మోహిస్తాడు. ఆమె వెంటపడి.. పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. మోహిని వెంట పరుగుతీస్తూ.. పరమేశ్వరుడు.. వీర్య స్కలనం చేస్తాడు. దాన్నుంచి పుట్టని వాడే హరిహరసుతుడు. ఇక్కడ పార్వతి దేవి తేజస్సు.. అనగా.. నారాయణినే.. నారాయణుడిగా మారింది. అంటే అమ్మవారే.. శివుడితో శృంగారం జరిపింది. అలా జన్మించిన వాడే హరిహరసుతుడు.
మరి ఇక్కడ అమ్మవారు తన తేజస్సును నారాయణుడిలో ప్రవేశపెట్టి.. ఆరూపంలో సంగమం ఎందుకు అంటే.. మహిషి సంహారం. అందుకే హరిహరుల కలయిక జరిగి.. అయ్యప్ప స్వామి జన్మించాడు. ఆ తర్వాత లోకాన్ని పీడిస్తున్న మహిషిని అంతం చేశాడు. అంటే పార్వతీదేవి.. తన తేజస్సును మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువులో ప్రవేశపెట్టి.. హరిహరుల సంగమం జరిగేలా చూసింది.
అయ్యప్ప స్వామి జన్మ వెనక ఉన్న అసలు రహస్యం ఇది. వీటన్నింటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోకుండా.. నోటికి వచ్చినట్లు పిచ్చి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం. దేవుడిని నమ్మాలా.. వద్దా అనేది వ్యక్తిగత ఇష్టం. మీరు దేవుడిని నమ్మరు.. అది మీ ఇష్టం.. కానీ కోట్ల మంది పూజించే.. దైవం గురించి నోటికి వచ్చినట్లు వాగడం కరెక్టేనా.. ఇలాంటి వారంతా.. తమ వాదనలను సమర్థించడం కోసం.. బాబా సాహేబ్ అంబేద్కర్ పేరు ప్రస్తావిస్తున్నావ్.. నీ చేతలు, మాటలతో.. వేరే వారి మనోభావాలు కించపరిచే హక్కు మీకుందని అంబేద్కర్ ఎక్కైడైనా చెప్పాడా.. రాజ్యాంగంలో మీకు ప్రత్యేక హక్కు ఇచ్చారా.. వాక్ స్వాతంత్య్రం అంటే అవతలి వారి మనోభావాలను కించపర్చడమేనా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.
బుద్ధుని మార్గంలో వెళ్దాం అంటున్నావ్.. ఆ బుద్ధుడు కూడా సమ్యక్ వాక్కు అన్నాడే తప్ప.. ఎవరిని దూషించమని చెప్పలేదు కదా. మీలాంటి పనికి మాలిన వాళ్లు.. మహనీయుల పేర్లు చెప్పి.. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తీరు మార్చుకోకపోతే.. తగిన ఫలితం అనుభవించకతప్పదని అర్థం చేసుకుంటే మంచిది అని హెచ్చరిస్తున్నారు నెటిజనులు. లోక కళ్యాణం కోసం జన్మించిన అయ్యప్ప స్వామి పుట్టుక గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.