ఈజిప్ట్ పిరమిడ్లు మన పురాతన భారతీయులు నిర్మించారు! ఈ మాట అనగానే ఇదేదో గాలి వార్త అనుకుంటున్నారు కదా? కాని, ఈ మాట అన్నది ఎవరో మామూలు వాళ్లు కాదు…. స్వామి వివేకానంద! అవును, స్వామీజీ 1900వ సంవత్సరం 15 నవంబర్ నుంచీ 25 నవంబర్ దాకా పిరమిడ్ల వద్దే వున్నారు. వాట్ని లోతుగా అధ్యయనం చేశారు. అప్పుడు ఆయన అంతిమంగా నిర్ణయించింది… ఈజిప్ట్ పిరమిడ్ల రూపకర్తలు మన కేరళ నుంచి వెళ్లిన శిల్పులేనని! కేవలం ఈజిప్టే కాదు మాయన్ , బాబిలోనియన్ కట్టాడాలు కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. అవి కూడా మన హిందూ ఆలయాల మాదిరిగానే వుంటాయి. మరీ ముఖ్యంగా గోపురాలు చాలా స్పష్టంగా పోలికలు కలిగి వుంటాయి! భారతీయ ఆలయ గోపురాల్ని చూసి కట్టినట్టుగానే ఈజిప్టు పిరమిడ్ల ఆకారం వుంటుంది. అలాగే, అనేక ఇతర పురాతన నాగరికతల్లో కూడా రకరకాల పిరిమిడ్లు నిర్మించే సంప్రదాయం వుంది. అన్నీ మన ఆలయ గోపురాల్నే పోలి వుంటాయి. ఎత్తుగా, ఆకాశం వేపు దూసుకుపోతూ, అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో వీట్ని నిర్మించారు ఒకప్పటి వారు. ఇలాంటి ప్రపంచ గోపురాలన్నిట్లో అత్యంత పురాతనమైనవి మన భారతదేశంలోనే వున్నాయి. ఆ తరువాత కట్టిన ఇతర దేశాల్లోని పిరమిడ్లుగా పిలవబడే భారీ గోపురాలు… నిస్సందేహంగా మన ఆలయ శిఖరాల నుంచే ప్రేరణ పొందినవని చెప్పవచ్చు. హిందువులు మేరు పర్వతం పై భగవంతుడు కొలువై వుంటాడని భావిస్తారు. ఆ మేరు పర్వతం భూమండలం నడిమధ్యలో వుందని విశ్వసిస్తారు. దాని చుట్టూనే ఆకాశంలోని నక్షత్రాలు, సూర్య, చంద్రులు పరిభ్రమిస్తుంటారని భావిస్తారు. ఈ మొత్తం సిద్దాంతాన్నే మన నుంచి గ్రీకులు స్వీకరించారు. మన మేరు పర్వతాన్నే ఒలంపస్ పర్వతంగా మార్చుకున్నారు. అయితే, ప్రస్తుతం పురాతన గ్రీకు మతం అంతరించిపోయింది. ఇంకా అప్పటికీ, ఇప్పటికీ గుళ్లలో దేవుళ్లని పూజిస్తున్న ఏకైక మతం హిందూ మతమే! యూరప్, ఆఫ్రికా, అమెరికాల్లో ప్యాగన్లుగా పిలవబడ్డ విగ్రహారాధకులు ఎప్పుడో క్రిస్టియన్లుగా, తరువాత ముస్లిమ్ లుగా మారిపోయారు. హిందువులు అనేక ఆక్రమణలు, ఊచకోతలు తట్టుకుని ఇంకా సజీవంగా కొనసాగుతూ వస్తున్నారు.
ఇక ఒకప్పుడు భూమ్మీది అనేక ప్రాంతాల్లో విగ్రహారాధన చేసే మతస్థులు వున్నప్పుడు భారీ పిరమిడ్లను ఈజిప్టు ఫారోలు నిర్మించారు. ఆ పిరమిడ్స్ కు మూలం మన శ్రీచక్రమే! శ్రీచక్రం కొలతల ఆధారంగానే భారీ ఆకారంలో పిరమిడ్లు నిర్మించేవారు. ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ చెపోస్ కింద భాగం 51డిగ్రీల 49నిమిషాలు వుంటుంది. ఇది 11వేల ఏళ్ల పురాతన శ్రీచక్రం కొలతలతో సరిగ్గా సరిపోలుతుంది! అసలు నేటి తరం హిందువులకి చాలా మందికి శ్రీచక్రం గురించి కూడా ఏమీ తెలియదు. అమ్మవారి నివాస స్థానంగా మన వారు ఊహించిన అద్భుతమైన విశ్వ స్వరూపమే శ్రీచక్రం. అనేక వలయాలు, కోణాల పరంపరగా ఇది వుంటుంది. దీనిపై దృష్టి కేంద్రీకరించటం చాలా కష్టం. దృస్టిని స్థిరంగా మధ్యలో వుండే బిందువులో నిలపటం మరింత కష్టం. కాని, ఈ శ్రీచక్రమే పిరమిడ్ల నిర్మాణానికి మూలం. చాలా పెద్ద పెద్ద పిరమిడ్లు శ్రీచక్రంలోని వృత్తాలు, త్రిభుజాల మాదిరిగానే నిర్మించారు అనాటి వారు. ఈజిప్ట్ రాజులు దాదాపు 17మందికి రామ్ సెస్ అనే బిరుదు వుండేది. దాని అర్థం రామ్ శేషన్ అని! అంటే… మన రామాయణంలోని సకలగుణాభి రాముడే! ఆయనే వారికి కూడా ఆరాధ్య దైవం! ఈ వివరణ ఇచ్చింది కంచి పరమాచార్య స్వామి వారు. 1932లో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు! ఇలాంటి అనేక అంశాల కారణంగా పిరమిడ్ లు ఖచ్చితంగా మన పురాతన సనాతన ధర్మానికి చెందినభారతీయులే నిర్మించారని చెప్పవచ్చు! అంతే కాదు, స్వామి వివేకానంద లాంటి మహా పురుషులు కూడా అది నిజమని ప్రకటించారు. ఇప్పటికీ చాలా మంది దాన్ని శాస్త్రీయంగా నిరూపించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.