హిందువులకు ఎంతో ప్రీతికరమైన పర్వదినం మహా శివరాత్రి. మహా శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. రాత్రంతా మెలకువగా ఉండి శివ నామస్మరణ చేస్తుంటారు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఉపవాసం ఉండలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇలా చేస్తే ఉపవాసం చేసిన దాని కన్నా ఎక్కువ ఫలితం దక్కుతుందట.
మహా శివరాత్రి ఫిబ్రవరి 18న వచ్చింది. హిందువులకు ఎంతో ఇష్టమైన పర్వదినం ఈ మహా శివరాత్రి. శివుడికి కూడా ఈ రోజు అంటే ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెబుతారు. శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఉంటే ఆయన అనుగ్రహం పొందవచ్చునని భక్తుల విశ్వాసం. కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ ఉండి శివ నామస్మరణ చేస్తారు. అయితే ఉపవాసం ఉండడం అనేది అందరికీ సాధ్యమవ్వదు. పనులకు వెళ్లేవారు ఉంటారు. పని నిమిత్తం దూర ప్రయాణాలు వెళ్లేవారు ఉంటారు. అలాంటి వారికి ఉపవాసం చేయడం కష్టమే. కాబట్టి సాయంత్రం పని మీద వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక ఇలా చేస్తే ఉపవాసం ఉన్నదాని కంటే ఎక్కువ ఫలితం ఉంటుందని రమా రావి గారు చెబుతున్నారు.
ఉపవాసం అంటే కేవలం కడుపుకి మాత్రమే కాదు, నోటికి కూడా ఉండాలని అంటున్నారు. ఆహారానికే కాకుండా నోటికి కూడా ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. ఉపవాసం పేరుతో నోటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. తిట్టుకోవడం, గొడవ పడడం, దూషించడం వంటి పనులు నోటికి చెప్పకూడదు. దుర్భాషలాడకుండా, ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటే ఫలితం దక్కుతుందని అంటున్నారు. నమఃశ్శివాయ మంత్రాన్ని, పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే బాగుంటుందని, ఏదైనా పొరపాటు జరిగితే శివ అని జపిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. ఎంత ఎక్కువగా శివుడితో మమేకమై ఉంటే శివుడి కరుణ, కటాక్షాలు అంత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలానే నోటికి ఉపవాసం ఉండాలని అంటున్నారు.
కార్తీక పురాణం, మార్క పురాణం చదువుకోవాలి. లింగోద్భావ కాలం అయిపోయాక జాగరణ ఉండలేని వారు నిద్రపోవచ్చునని చెబుతున్నారు. ఇంట్లో పెద్ద వాళ్ళు నిద్రకి ఆగలేరు కాబట్టి తెల్లవారుజామున 2.30, 3 గంటల సమయంలో నిద్రపోవచ్చునని అన్నారు. శివరాత్రి నాడు ఉపవాసం ఉంటే మంచిది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్న వారు ఉండచ్చు. ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఏదో కొద్దిగా తిని అయినా సరే ఉండవచ్చు. ఉపవాసం ఉండలేని వారు చేయగలిగే ఉపవాసం ఏదైనా ఉందంటే అది నోటి ఉపవాసం చేయడం. నోటిని నియంత్రించుకుని శివ నామస్మరణ చేస్తూ ఉంటే ఉపవాసం చేసిన దాని కంటే ఎక్కువ ఫలితం ఉంటుందని చెబుతున్నారు. పని చేసేటప్పుడు కూడా శివ నామస్మరణ చేసినా ఫలితం దక్కుతుందని రమా రావి గారు అంటున్నారు. ఇంకా మహాశివరాత్రి నాడు పూజలు ఎలా చేయాలి? ఏమేం పనులు చేయాలి? ఏం పనులు చేయకూడదు? ఎలాంటి ఫలితం ఉంటుంది? అనే వివరాలు కింద వీడియోలో వివరించారు. వీడియో చూడగలరు.