శివుని ఆజ్జ లేనిదే చీమైన కుట్టదంటారు. అలాంటి ఘటనే ఓ రాష్ట్రంలో చోటుచేసుకుంది. శివలింగం తొలగించే విషయంలో జరిగిన ఊహించని ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
శివుని ఆజ్జ లేనిదే చీమైన కుట్టదంటారు. అలాంటి ఘటనే ఓ రాష్ట్రంలో చోటుచేసుకుంది. శివలింగం తొలగించే విషయంలో జరిగిన ఊహించని ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మనదేశంలో శివుడిని ఆరాధ్య దైవంలా భావించే శైవ భక్తులకు కొదవలేదు. దేశంలో ప్రసిద్ధమైన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. శివ భక్తులు అత్యంత భక్తి శ్రధ్దలతో తమ కష్టాలను తీర్చి భోగభాగ్యాలను ప్రసాదించాలని శివున్ని మొక్కుకుంటారు. అంగరంగవైభవంగా శివ పండుగలను నిర్వహిస్తుంటారు. అయితే ఓ స్థల వివాదంలో చోటుచేసుకున్న వివాదం కోర్టు మెట్లెక్కింది. ఆ స్థలంలో ఉన్న శివలింగం ప్రస్తావన వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే?
పశ్చిమబెంగాల్ లో గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం చోటుచేసుకుంది. వివాదం చెలరేగుతున్న తరుణంలో ఆ స్థలంలో ఉన్నట్టుండి శివలింగం ప్రత్యక్షమైంది. అయితే ఈ ఘటన వెనకాల సుదీప్ మండల్ హస్తం ఉన్నట్లు గోవింద్ ఆరోపించాడు. ఈ క్రమంలోనే గోవింద్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆ వివాదాస్పద స్థలంలో ఉన్నటువంటి శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పును వెల్లడించారు. ఆ సమయంలో ఆ తీర్పును నోట్ చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ అంశంలో హైకోర్టు కలగజేసుకోదని కింది కోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్లకు న్యాయమూర్తి సూచించారు.