కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన సోమావతీ అమావాస్య నేడు(17.07.2023) సోమవారంతో కలిసి వచ్చింది. అయితే ఈ రోజు ఒక పని చేస్తే ఆకస్మిక ధనం కలిసి వస్తుంది.
సాధారణంగా అమావాస్య అంటే బయపడిపోతాము. ఆ రోజు ఎక్కడికీ వెళ్ళకూడదు అని బలంగా గీటు గీసుకొని ఇంట్లోనే ఉంటాము. ఎందుకంటే అమావాస్యనాడు ఎక్కడికైనా వెళ్తే ఆపశకునం తగులుతుందని భావిస్తాం. ఏ మతం వారైనా ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. అయితే “సోమవాతి అమావాస్య” కి మాత్రం కొంత ప్రత్యేకత ఉంది. అంతేకాదు ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తారు. కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన సోమావతీ అమావాస్య నేడు(17.07.2023) సోమవారంతో కలిసి వచ్చింది. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే ఈ రోజు ఒక పని చేస్తే ఆకస్మిక ధనం కలిసి వస్తుంది.
సోమావతి అమావాస్య రోజున శివారాధన తో పాటు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు చేయవలసిన జాబితా చాలానే ఉంది. ఉదయానే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం – సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక ధనం కావాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా పేద వారికి సహాయం చేయాలి.
ప్రస్తుతం కాలంలో డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారమవుతుంది. సగటు మానవుడు ఈ డబ్బు కోసం ఆరాట పడుతూ పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ సోమవతి అమావాస్యనాడు నీరు పేదలకు నిస్వార్ధంగా సహాయం చేస్తే మీకు ఆకస్మిక ధనం మీ దగ్గరకు వస్తుంది. ఆ రోజు శివారాధన చేస్తూ ఉపవాసంతో నీరు పేదల మీద కనికరం చూపిస్తే సాయంత్రం లోగా మీకు ధనం లభిస్తుందని పూర్వికులు చెబుతున్నారు. సోమావతీ అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. పేదల సహాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. పేదలకు మనం చేసే ఈ నిస్వార్ధ సహాయం మనకు ధనాన్ని తీసుకొచ్చి పెడుతుంది.