సమాజంలో రోజు రోజుకు మంచి, మానవత్వం కనుమరుగవుతున్నాయి. తన స్వార్థం కోసం ఎదుటి వారిని బలి చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో సమాజంలో అనైతిక సంబంధాలు పెరిగిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం.. వావివరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి విజయనగరంలో చోటు చేసుకుంది. తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె కుమార్తెపై కన్నేశాడు. చివరకు బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకెళ్లాడు. తీరా అక్కడకి వెళ్ళాక తల్లికి ఫోన్ చేసి బాలికను పెళ్లి చేసుకుంటున్నాని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. చేసేది లేక ఆ తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది.
ఆ వివరాలు.. పట్టణానికి చెందిన నక్కాన లక్ష్మికి 14 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకు17 ఏళ్ల కూతురు ఉంది. కేటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఆ సమయంలో సురేష్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కుమార్తెతో కలిసి అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తెపై మోజుపడిన సురేష్, బాలికకు మాయమాటలు చెప్తూ మచ్చిక చేసుకున్నాడు. ప్రస్తుతం డ్రైవర్‌గా పని చేస్తున్న సురేష్.. తిరుపతికి బేరంపైన వెళ్తున్నానని, ఒక టికెట్ ఖాళీగా ఉందని లక్ష్మిని నమ్మించి కుమార్తెను తీసుకెళ్లిపోయాడు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత లక్ష్మికి ఫోన్ చేసి తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆమె వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.