ఆడపిల్లలు తమ పెళ్లి తరువాత అత్తగారింట ప్రారంభించే కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలకు తగినట్లే కొత్త కాపురం సాగుతుంటుంది. అయితే కొందరి ఆడపిల్లల జీవితం మాత్రం నరక ప్రాయంగా ఉంటుంది. తాజాగా కాళ్లపారాణి ఆరక ముందే ఓ నవ వధువు మృతి చెందింది.
యువతి యువకులకు పెళ్లి తరువాత మొదలయ్యే కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ భాగస్వామితో సాగే జీవన ప్రయాణం గురించి ఎన్నో ఆశలు, కలలు కంటారు. అలా కోటి ఆశలతో అత్తగారింట ఆడపిల్లలు అడుగుపెడతారు. కొందరి జీవితం హాయిగానే సాగుతుంది.. కానీ మరికొందరి సంసారం మాత్రం నరకప్రాయంగా మారుతుంది. ఇంకా దారుణం ఏమిటే కాళ్లపారాణి ఆరక ముందే కొందరు నవ వధువులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంగరంగా వైభవంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే.. విగతజీవిగా మారిన కూతుర్ని చూసిన తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. తాజాగా ఓ నవవధువు పెళ్లైన రెండు నెలలకే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యపురానికి చెందిన చౌదరిపల్లి నర్సింహులు, వసంత భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పావని అలియాస్ నిత్య(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలోనే జనగాం లోని శ్రీనగర్ కాలనీకి చెందిన మరాఠి యాదగిరి కుమారుడు నాగరాజుతో.. పావనికి పెళ్లి కుదిరింది. నాగరాజు ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 18న వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.28 లక్షలకు, రూ.16 లక్షలు పావని వాళ్ల తల్లిదండ్రులు వరుడు కుటుంబానికి ఇచ్చారు.
మిగిలిన రూ.12 లక్షలు తరువాత ఇస్తామని తెలిపారు. పెళ్లైన కొన్ని రోజులకే మిగిలిన డబ్బులు ఇవ్వాలని పావని భర్త, అత్తమామలు, మరిది తరచూ వేధిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు కావడంతో పావని పుట్టింటకి వచ్చేసింది. ఫిబ్రవరి 4న నాగరాజు, అతడి భార్య పావనితో కలిసి హైదరాబాద్ లోని మల్లాపూర్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పావని పుట్టింటి వారితో మాట్లాడిన నాగరాజు.. డబ్బుకోసం ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవల వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగినట్లు సమాచారం.
దీంతో పావని తీవ్ర మనస్తాపానికి లోనై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టి యువతికి అప్పుడే నిండునూరేళ్లు నిండిపోయాయి. ఈ ఘటన స్థానికుల మనస్సును కలచివేసింది. వరకట్న దాహానికి ఇంకా ఎందరు ఆడపిల్లలు బలి కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.