భార్యాభర్తల మధ్య నెలకొన్న తగాదాలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. అపార్థాల పెను విషాదాన్ని నింపుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. దానికి ఉదాహరణగా నిలిచింది జనగామ ఎస్సై కుటుంబం.
ఆడపిల్లలు తమ పెళ్లి తరువాత అత్తగారింట ప్రారంభించే కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలకు తగినట్లే కొత్త కాపురం సాగుతుంటుంది. అయితే కొందరి ఆడపిల్లల జీవితం మాత్రం నరక ప్రాయంగా ఉంటుంది. తాజాగా కాళ్లపారాణి ఆరక ముందే ఓ నవ వధువు మృతి చెందింది.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 238వ రోజు జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది.
మనిషికి దేవుడు ప్రాణం ఇస్తే.. ఆ ప్రాణానికి ఏదైనా అపాయం జరిగిదే వైద్యం చేసి మళ్లీ ప్రాణాలు రక్షించే గొప్ప వృత్తి వైద్య వృత్తి. అందుకే వైద్యుడిని దేవుడితో పోలుస్తుంటారు. డాక్టర్ కావడం అనేది సామాన్య విషయం కాదు.. దానికోసం ఎంతో కష్టపడాలి. అందులో సక్సెస్ సాధించేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మద్య కొంత మంది కంపౌండర్లు, చిన్న చిన్న మూలికా వైద్యం చేసేవారు సైతం దొంగ సర్టిఫికెట్స్ తో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. […]
తెలంగాణ జనగామ జిల్లా సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా.. కాన్వాయ్ నుంచి మహిళా కానిస్టేబుల్ జారి రోడ్డుపై పడ్డారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభానికి ఇవాళ సీఎం కేసీఆర్ వెళ్లారు. ఉదయం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించి.. హాస్పిటల్ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన కేసీఆర్.. జనగామ జిల్లా, […]
అమ్మ.. ప్రపంచంలో ఇంతకు మించిన బలమైన మాట లేదు. ప్రాణాలు పోయే అంత నరకం అనుభవించి.. బిడ్డకి ప్రాణాలు పోస్తుంది అమ్మ. అందుకేనేమో ఆ పేగు బంధం ముందు.. ఏదీ సరితూగదు. పుట్టకముందు మాత్రమే కాదు, పుట్టాక కూడా కడుపులో పెట్టుకుని సాకడం ఒక్క అమ్మకే సాధ్యం. కానీ ఇక్కడ ఒక తల్లి తన 8 ఏళ్ల బాబుని వదిలించుకోవాలని చూసింది. దూరంగా పోయి బతకరా అంటూ దగ్గరుండి మరీ రైలు ఎక్కించింది. అమ్మ అనే పదానికే […]
అల్లరి చేస్తున్నాడన్న కారణంగా లోకం తెలియని 8 ఏళ్ల కుమారుడ్ని ఒక కన్న తల్లి వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రామాంతపూర్ కి చెందిన అంబికకు మణికంఠ అనే 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో ఆమె శ్రీను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. అయితే మణికంఠ బాగా అల్లరి చేస్తున్నాడని, తన మాట వినడం లేదని, ఎదురు తిరుగుతున్నాడని ఆ తల్లి విసిగిపోయింది. […]
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద నీటితో రోడ్లు జలమయమవుతున్నాయి. దీంతో రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్న వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఆ వరద నీటి ప్రవాహ వేగానికి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇటీవలే పలు చోట్ల వాహనాలు అదుపు తప్పి వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటనలు మనం చూశాం. తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లాలో వరద ప్రవాహానికి బండి అదుపు తప్పింది. ఈ ఘటనలో ఓ మహిళ వరద ప్రవాహంలో […]
తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని యువతి ఆత్మహత్య.. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. బలవంతపు పెళ్లిల్లతో నలిగిపోతున్న అనేక మంది యువతులు బతకలేక , చావాలేక ఎటూ తెల్చుకోలేకపోతున్నారు. కోరుకున్నవాడితో ఏడడుగులు నడిచి అతనితోనే సంతోషమైన జీవితాన్ని గడపాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. ఇలాంటి తరుణంలోనే కూతుళ్ల ఇష్టాలను కాదని కొందరు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లిల్లు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇలా బలవంతపు పెళ్లిల్లకు అనేక మంది మహిళలు పెళ్లైన కొన్ని రోజులకే […]
తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మంజుల అనే మహిళకు హైదరాబాద్ కు చెందిన వినోద్ తో గతంలో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొంత కాలం నుంచి భర్త వినోద్ మరో మహిళను పెళ్లి చేసుకుని […]