పోలీసులు అంటే సమాజంలోని అసాంఘీక శక్తులను నిర్మూలిస్తూ.. ప్రజలకు రక్షణగా ఉంటారు. అందుకే ప్రజలు.. తమకు ఏ సమస్య వచ్చిన, అన్యాయం పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కిడ్నాప్ కి గురైన ఎందరో పిల్లల్ని పోలీసులు.. ఎంతో చాకచక్యంగా కాపాడారు. ఇటీవల పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయిన ఎనిమిదేళ్ల బాలుడిని పోలీసులు ఎంతో శ్రమించి..24 గంటల్లోని కాపాడారు. కొందరు పోలీసులు మాత్రం డబ్బుల కోసం అడ్డదారులు తొక్కి.. మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారు. ఓ ప్రభుత్వ అధికారిని కిడ్నాప్ చేసి.. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఘటన దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆదాయపు పన్నుశాఖలో పనిచేసే ఓ వ్యక్తి దిల్లీలోని జీటీబీ ఎన్ క్లేవ్ లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 11న సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి కారులో తన ఇంటికి బయలు దేరాడు. మార్గం మధ్యలో ఆయన కారుని మరో ముగ్గురు వ్యక్తులు ఓ కారులో వచ్చి అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా ఆయన కారులోకి ఎక్కి.. దాడికి పాల్పడ్డారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అని చెప్పి గన్ తో బెదిరంచారు. అతడి వద్ద ఉన్న రూ.35 వేలను లాక్కున్నారు. తనను విడిచిపెట్టమని వారిని ప్రాధేయపడిన రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తప్పుడు కేసులు భనాయించి జైలుకు పంపిస్తామని బెదిరించారు. ఆ అధికారిని తీసుకుని ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కూడా మరోసారి దాడికి పాల్పడ్డారు. ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 50 వేలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.
అంతటి తో ఆగక మరో రూ.70 వేలు వేరే వ్యక్తి నుంచి బాధితుడు అప్పు తీసుకునేలా చేసి.. వాటిని తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. విషయాన్ని ఎవరికైన చెప్తే చంపేస్తామనవి హెచ్చరించి వదిలేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితుడు ఈ విషయాన్ని మొత్తం పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్, దోపిడ్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తులో ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది. ఈ కిడ్నాప్ వ్యహారం మొత్తం నడిపింది అమిత్ అనే ఓ కానిస్టేబుల్ అని తెలిసింది. అతడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబులు కూడా ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారు. వీరిద్దరు సీమాపురి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. నేరంకి పాల్పడిన ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఓ ఎస్సై కూడా ఈ కిడ్నాప్ వ్యవహారంలో హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.