ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు మధుభారతి ( 21). గురువారం తల్లిదండ్రులను నమ్మించి మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. సాయంత్రం మధు భారతి తల్లిదండ్రులు కూతురికి ఫోన్ చేయగా అత్తారింట్లో జరిగిన సీన్ చూసి తట్టుకోలేకపోయారు. ఇక చేసేదేం లేక చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది ఏపీలోని వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం లింగాలకుంట గ్రామం. ఇదే ప్రాంతంలోని ఎస్టీ కాలనీకి చెందిన మధు భారతి అనే యువతి తల్లిదండ్రులతో పాటే నివాసం ఉంటుంది. అయితే గురువారం ఉదయం కడపలో ఉన్న తన మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని మధుభారతి తల్లిదండ్రులను నమ్మించి బస్సులో బయలు దేరింది. ఇక సాయంత్రం కూతురు వెళ్లిన సమాచారం తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. కానీ మధుభారతి ఇక్కడకు రాలేదని బంధువులు సమాచారంఇచ్చారు.
దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో మధుభారతి తల్లిదండ్రులు కూతురి జాడ కోసం అంతటా వెతికారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇక చేసేదేం లేక చివరికి మధుభారతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మధుభారతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మధుభారతి కనిపించకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.