పెళ్లంటే నూరేళ్ల పంట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే భార్యాభర్తల వైవాహిక జీవితంతో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇక వీటితో పాటు అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుంటాయి. వీటన్నిటినీ భరించుకుంటూ ముందుకు సాగడమే సంసారం. కానీ చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలకే కొందరు భార్యాభర్తలు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు.. ఇది కుదరకపోతే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇల్లాలు భర్తతో ఉండలేక ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇక పోతూ పోతూ.. నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నా కోసం వెతకొద్దు అంటూ లేఖ రాసి వెళ్లిపోయింది. ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన స్వామి, శిరీష దంపతులు. వీరికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు, కూతురు సంతానం. అయితే ఉన్న ఊరిలో బతుకు దెరువు భారంగా మారడంతో ఈ దంపతులు గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లోని వీఎన్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త ఎలక్ట్రీషన్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ నెల 7న భర్త పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. కాగా భర్త మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది.
దీంతో అనుమానం వచ్చిన భర్త హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంట్లో భార్యతో పాటు తన కూతురు కూడా కనిపించలేదు. ఏం జరిగిందంటూ ఖంగారు పడుతున్న క్రమంలోనే.. నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నా కోసం వెతకొద్దు అంటూ భార్య లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త భార్య జాడ కోసం అటు ఇటు వెతికాడు. ఎక్కడ కూడా భార్య ఆచూకి కనిపించలేదు. ఇక ఏం చేయాలో తెలియక భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శిరీష కనిపించకపోవడంతో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.