ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు నేటి యువత. అయితే విదేశాలకు వెళ్లాక వీరి లక్ష్యాలకు అడ్డుపడుతున్నాయి అక్కడి అలవాట్లు, పద్ధతులు. వాటిని అలవర్చుకుని స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడుతున్నారు. విచ్చలవిడిగా శృంగారం, ఇతర వ్యవసనాలకు లోను అవుతున్నారు. తాజాగా ఓ తెలుగు కుర్రాడు ఈ అలవాట్లకు లోనై ..
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు నేటి యువత. మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాలని భావిస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లాక.. స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు.. అక్కడ ఆధునిక కల్చర్‌ను ఒంట పట్టించుకుంటున్నారు. విచ్ఛల విడి శృంగారం, మద్యానికి బానిస కావడం, పబ్ కల్చర్ వంటివి వాటికి లోనై.. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో వెనకబడుతున్నారు. ఎన్నో కలతోనే అమెరికా వెళ్లిన ఓ తెలుగు కుర్రాడు.. శృంగారం మోజులో పడి అభాసుపాలు కావడంతో పాటు కటకటాల వెనక్కు వెళ్లాడు.
వివరాల్లోకి వెళితే.. తెలుగు యువకుడు వినీత్ రావూరి ఉన్నత విద్య …ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. సెక్స్‌వర్కర్‌పై దాడి కేసులో అరెస్టయ్యాడు. న్యూజెర్సీ లోని సెకాసస్ ప్రాంతంలో అలోఫ్ట్ హోటల్‌లో జరిగిన ఘటనలో వినీత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే 26 ఏళ్ల వినీత్ రావూరి శృంగారం మోజులో ఓ సెక్స్ వర్కర్‌తో ఒప్పందం కుదుర్చుకుని అలోఫ్ట్ హోటల్‌కు పిలుపించుకున్నాడు. అయితే డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలంటూ ఆమెకు కత్తి చూపి బెదిరించాడు. ఆమె డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమెను గది నుండి బయటకు రాకుండా బంధించేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఆమె చేతికి, పిరదుల వద్ద గాయమైంది.
సెక్స్ వర్కర్ రూమ్ నుండి తప్పించుకుని హోటల్ లాంజ్ వైపు పరుగుకెత్తు కెళ్లి సాయం కోసం అరిచింది. ఆమె కేకలు విన్న సిబ్బంది తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ చేరుకున్న పోలీసులు వినీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సెక్స్ వర్కర్‌కు చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై సాయుధ దోపిడీ, తీవ్ర దాడి, క్రిమినల్ నియంత్రణ, చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం ఆయుధాన్ని కలిగి ఉండటం, అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటం, వ్యభిచారంలో పాల్గొనడం వంటి అమెరికన్ సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం వినీత్‌ను హడ్సన్ కౌంటీ జైలులో ఉంచారు