సింగరేణి కాలనీ చిన్నారి జీవితాన్ని చిదిమేసిన రేపిస్ట్ రాజుని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా నిలుస్తోంది. రాజు ఏదో ఆకతాయి, అతన్ని సులభంగా పట్టుకోవచ్చని పోలీసులు ముందుగా భావించారు. కానీ.., నిందితుడు రాజు వేషాలు మారుస్తూ, జనావాసాల్లోనే తిరుగుతూ ఇటు పోలీసులని, అటు పబ్లిక్ ని బోల్తా కొట్టిస్తున్నాడు.
సంఘటన జరిగిన తరువాత మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్ క్యారీబ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకుని రాజు ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. కానీ.., అతను ఎల్బీనగర్ కి చేరే సరికి తలపై క్యాప్, జుట్టుకు ఉన్న రబ్బర్ బ్యాండ్తీసేసి గెటప్ మార్చేశాడు. తరువాత ఉప్పల్ రింగ్‌రోడ్డు చేరే సమయానికి చేతిలో ఉన్న ప్లాస్టిక్కవర్, మెడలో తువాల కూడా వదిలేశాడు. అంటే.., రాజు స్థిరంగా వేటిని క్యారీ చేయడం లేదు. దీంతో.. రాజుని పబ్లిక్ సైతం గుర్తు పట్టలేకపోతున్నారు.
రాజు పూర్తిగా గెటప్ మారిస్తే ఎలా ఉంటాడని పోలీసులు కొన్ని ఉహా చిత్రాలు రిలీజ్చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 2000లకి పైగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అయినా.. ఫలితం శూన్యం. కానీ.., వరంగల్, నల్గొండ యాదాద్రి భువనగిరి మార్గల్లో రాజు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.హైవే లోని వైన్స్, హోటల్స్, ఇసుక లారీల అడ్డాలు, టెంపుల్స్‌లో గాలిస్తున్నారు. పోలీసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గాలింపు చర్యలతో రాజు ఏ క్షణంలోనైనా దొరకొచ్చని తెలుస్తోంది. మరి.. రాజు దొరికితే అతనికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.