విలాసాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం పాకులాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. డబ్బు కోసం చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల ఇళ్లే అనుకుంటే.. భారీ సెక్యూరిటీ ఉండే ప్రముఖుల ఇళ్లను కూడా వదడలం లేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఈ బాధితుల జాబితాలో చేరారు. సోనమ్ ఇంట్లో దూరిన దొంగలు 2.5 కోట్ల రూపాయల విలువ చేసే డబ్బు, నగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ప్రెగ్నెన్సీ ఫోటోస్ వైరల్!
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా ఢిల్లీ నివాసం హరీష్ అహుజా బంగాళాలో.. 2022, ఫిబ్రవరిలో ఈ దొంగతనం చోటు చేసుకుంది. దీని గురించి ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేశారు. సుమారు 2.5 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయినట్లు తెలిపారు. వాస్తవంగా ఈ దొంగతనం గురించి సోనమ్ కపూర్ దంపతులకి ఫిబ్రవరి 11ననే తెలిసింది. కానీ వారు ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. టీమ్స్ రంగంలోకి దిగాయి. ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇలాంటి దొంగతనం గురించి ఎప్పుడు విని ఉండరు!సోనమ్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం ఇది రెండో సారి. గతంలో ఆమెకు వరసకు మామ అయ్యే వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసిపోయి.. ఏకంగా 27 కోట్లు పొగొట్టుకున్నారు. ప్రసుత్తం ఈ కేసు విచరాణ కొనసాగుతుండగానే.. మరో సారి సోనమ్ కపూర్ ఇంట చోరీ చోటు చేసుకోవడం గమానార్హం అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ తీసుకున్న పారితోషికం 11 రూపాయలు