టాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో డ్రగ్స్ కేసు ఎంతటి కలకలం సృష్టించిందో అందరికి తెలుసు. టాలీవుడ్ టాప్ హీరోస్, డైరెక్టర్, హీరోయిన్ ఈ కేసులో విచారణ కూడా ఎదుర్కొన్నారు.
టాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో మాదక ద్రవ్యాల కేసు ఎంతటి కలకలం సృష్టించిందో అందరికి తెలుసు. టాలీవుడ్ టాప్ హీరోస్, డైరెక్టర్, హీరోయిన్ ఈ కేసులో విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వీరందరికీ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్ కొకైన్‌ను సరఫరా చేస్తూ.. విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ టీమ్, రాజేంద్ర నగర్ పోలీసులు కిస్మత్‌పూర్ క్రాస్ రోడ్ వద్ద కబాలీ నిర్మాత కెపీ చౌదరిని జూన్ 14న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడు అరెస్టు కావడంతో మరోసారి తెలుగు పరిశ్రమ ఉలిక్కి పడింది.
అదుపులోకి తీసుకుని కెపీ చౌదరిని విచారించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా ఆయన ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో చిన్న ఆర్టిస్టులతో ఆయన దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 12 మందికి కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా తేల్చారు. ఇందులో బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగూర్ విజ్ అలియాస్ ఠాగూర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు సావన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ ఉన్నారు. అలాగే కొకైన్ కొనుగోలు చేసిన జాబితాతో పాటు కొంత మంది సెలబ్రిటీలతో దిగిన 9 వేల ఫోటోలను గూగుల్ డ్రైవ్‌లో గుర్తించారు పోలీసులు.
అలాగే కొంత మందితో అనేక సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డితో పాటు సినీ నటి సురేఖావాణి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అతడి కాల్ లిస్టులో నేచురల్ స్టార్ నాని, హీరో నిఖిల్, హీరో వెంకట్, దర్శకుడు రాంగోపాల్ వర్మ, నటుడు రాజారవీంద్ర, నటి హరితేజ, యాక్టర్ జ్యోతి, క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ వంటి టాప్ సెలబ్రెటీస్ ఉన్నారు. అయితే వీళ్లందరిలో కేవలం ఆషు రెడ్డి, సురేఖావాణిల పేర్లు మాత్రమే తెరమీదకు రావడం మరింత కలకలం రేపుతోంది. ప్రస్తుతం వీరూ ఇటీవల ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అయినప్పటికీ లగ్జరీగా బతుకుతున్నారంటే అతడితో సాన్నిహిత్యమే కారణమని కొందరు భావిస్తున్నారు. మరికొంత మంది సెలబ్రిటీలు అన్నాక ఫోటోలు దిగడం కామన్. అంత మాత్రాన వారిని కూడా వారు తప్పు చేశారనుకోవడం సరైదని కాదని అంటున్నారు.