ఈమధ్య కాలంలో మిస్సింగ్ కేసులు అందునా యువతులు, మహిళలు మిస్ అవుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్‌లో ఓ యువతి కిడ్నాప్ అయ్యింది. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు చూస్తే.. నిజంగానే జరుగుతున్నాయా.. లేక కావాలనే చేస్తున్నారా అర్థం కాకుండా ఉంది. కొందరు తెలివి తక్కువతనం వల్లనో లేక అతి తెలివి కారణంగానో చేసే పనులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఇబ్బందిగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఈ తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. కిడ్నాప్ అయ్యానంటూ యువతి మెసేజ్ చేసింది.. ఆమె తండ్రి మాత్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయం వెల్లడించాడు. దాంతో అసలు ఏం జరిగింది ఉంటుందో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆ వివరాలు..
హైదరాబాద్ నగరంలో గత కొంత కాలంగా మహిళలు, యువతులు, చిన్నారి బాలికలు సైతం మిస్సవుతున్నారు. వరుస ఘటనలపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని మరిచిపోక ముందే మరో మిస్సింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి, కేపీహెచ్‌బీకి చెందిన ఇద్దరు యువతులు కనిపించకుండా పోయారు. వీరిని జ్యోతి, లిఖిత రమ్యగా గుర్తించారు. జ్యోతి కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తుండగా.. లిఖిత రమ్య కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకాం చదువుతోంది. వీరిద్దరికి ఇంటర్ చదివే రోజుల నుంచి పరిచయం. ఇద్దరు స్నేహితులు కూడా. ఈ క్రమంలో జ్యోతి తనను కిడ్నాప్ చేశారు.. ఈ విషయం తన అన్నకు చెప్పాల్సిందిగా మంగళవారం తన ఫ్రెండ్‌కు మెసేజ్ చేసింది.
జ్యోతి తల్లిదండ్రులు ఆమె గురించి ఆందోళన పడుతుండగానే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లిఖిత కూడా కనిపించడం లేదంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా తన కుమార్తె జ్యోతితోనే వెళ్లి ఉంటుందని బాంబు పేల్చాడు. దాంతో వీరిద్దరి మిస్సింగ్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జ్యోతి కిడ్నాప్ అయ్యానంటూ తన స్నేహితురాలికి మెసేజ్ చేయడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో లిఖిత కూడా మిస్సవ్వడం.. ఆమె తండ్రి జ్యోతితోనే వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొనడంతో.. పోలీసులు అవాక్కవుతున్నారు. జ్యోతి నిజంగానే కిడ్నాప్ అయ్యిందా లేక వీరిద్దరూ కలిసి పారిపోయారా అర్థం కావడం లేదు. పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు. మరి జ్యోతి, లిఖిత ఇద్దరు పారిపోయారా.. లేక కిడ్నాప్ చేశారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.