ఆకతాయిలు రెచ్చిపోయారు.. అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడినట్లు సమాచారం. లక్ష్మీపురం ప్రధాన రహదారిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఈ దాడి జరిగింది.
ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తిపై యువకులు దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్లే వారు వీడియో తీశారు. వారు వారించడంతో యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ దాడిలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వారు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడిపై ఆరా తీశారు. అయితే యువకులు దాడి ఎందుకు చేశారు? కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.