ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి రక రకాల హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్ర మొదలు పెట్టారు. ఏపిలో వారాహి యాత్ర మంచి సక్సెస్ కావడంతో జనసేన బలం బాగా పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సీట్లు కేటాయింపుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. పార్టీకి విధేయులు, పార్టీ కోసం ఇప్పటి వరకు తనకు వెన్నుదున్నుగా నిలిచి ఉన్నవారిని, ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నవారికి సీట్లు కేటాయిస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే మొదటి నుంచి జనసేన పార్టీకి విధేయులుగా ఉన్నవారిలో న్యాయవాది, జనసేన కార్యకర్త కళ్యాణ్ దిలీప్ సుంకర కు సీటు కేటాయిస్తే బాగుంటుందని కార్యకర్తలు, అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, జనసేన పార్టీ కార్యకర్త కళ్యాణ్ దిలీప్ సుంకర అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. గత కొంత కాలంగా కళ్యాణ్ దిలీప్ సుంకర ‘కామనర్ లైబ్రరీ’ పేరుతో యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రస్తుత రాజకీయాలు, ఇతర అంశాల గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు విశ్లేషిస్తుంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ.. జనసేన పార్టీ కార్యకర్తగా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరుపున సందర్భానుసారం వాదించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కల్యాణ్ దిలీప్ సుంకర అని అంటారు. మీడియాలో ఏదైనా చర్చా కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరుపున తనదై స్టైల్లో వాయిస్ వినిపిస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ వారిని నిలువరించే ప్రయత్నం చేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి సీట్ల కేటాయింపు పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజల్లోకి జనసేన వాదాన్ని తీసుకువెళ్తున్న దిలీప్ సుంకరకు సీటు కేటాయిస్తే పార్టీకి మంత బలం చేకూరుతుందని జనసేన అభిమానులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడు.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే వాడు పార్టీ అధికారంలోకి రావాలని బలంగా ఆకాంక్షించే దిలీప్ సుంకరకు వెస్ట్ గోదావరి భీమవరం, గుంటూరు, తూర్పు గోదావరి నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉండటంతో అక్కడ నుంచి ఎమ్మేల్యే సీటు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏపీలో జనసేన వాదాన్ని స్ట్రాంగ్ గా వినిపించాలంటే దిలీప్ సుంకర లాంటి ఫైర్ బ్రాండ్ ఒకరు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దిలీప్ సుంకర కు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తున్నట్లు అఫిషియల్ గా ప్రకటిస్తే పార్టీలో మరింత ఉత్సాహం పెరుగుతుందని జనసేన కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.