తన పాటలతో ఉర్రూతలూగించే సింగర్ మంగ్లీకి గాయాలు అయ్యాయంటూ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై గాయని మంగ్లీ స్పందించారు.
షూటింగ్ లో సింగర్ మంగ్లీ కాలికి గాయమైందని, తీవ్ర నొప్పితో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. అయితే షూటింగ్ సమయంలో మంగ్లీ కాలు జారి కింద పడ్డారని, దీంతో ఆమె కాలికి గాయమైందని వార్తల సారాంశం. యూనిట్ సభ్యులు వెంటనే మంగ్లీని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేసి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సుమన్ టీవీ సింగర్ మంగ్లీని సంప్రదించగా సింగర్ మంగ్లీ స్పందించారు. ఆమె స్వయంగా సుమన్ టీవీతో మాట్లాడారు.
షూటింగ్ లో గాయమైందని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను హ్యాపీగా షూటింగ్ లో పాల్గొంటున్నానని అన్నారు. జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ప్రైవేట్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. స్టార్ సింగర్ గా ఎదిగారు. సినిమాల్లో కూడా తన గానంతో పాటల మాధుర్యాన్ని అందిస్తున్నారు. తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ దాదాపు వందకు పైగా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే ప్రతీ పండుగకు ఆ పండుగ ప్రత్యేకతను తెలియజేస్తూ ఒక ప్రైవేట్ పాట పాడి.. వీడియో సాంగ్ షూట్ చేయడం ఆమెకు అలవాటు. ప్రతి ఏటా ఆమె పండుగ ప్రత్యేక వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే బోనాలు ఉత్సవాల సందర్భంగా ఆమె ఓ ప్రైవేట్ సాంగ్ చేస్తున్నారు.