సాధారణంగా సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాల్లో హీరోలకు ప్రమాదాలు జరిగి ఆస్పత్రిపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ మూవీతో పరిచయం అయిన నటులు తర్వాత హీరోలు గా మారారు. ఇందులో నటించిన తమన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ మూవీలో నటించిన వరుణ్ సందేశ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తన సహనటి వితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వరుణ్ సందేశ్ కి ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ మధ్య నాగార్జున హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ లో తన సతీమణి వితికతో సందడి చేశాడు. ప్రస్తుతం జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఫైటింగ్ సీన్ లో షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో వరుణ్ సందేశ్ కి ప్రమాదం జరిగింది. దీంతో ఆయన కాలికి బలమైన గాయం తగిలింది. డాక్టర్లు ఆయన కాలికి కట్టుకట్టి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సింది సూచించారు. దీంతో సినిమా షూటింగ్ అర్థాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
ది కానిస్టేబుల్ మూవీ బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ జీవిత కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం రెండో షెడ్యూల్ దాదాపు 40 శాంతం పూర్తయ్యిందని నిర్మాత తెలిపారు. వరుణ్ సందేశ్ పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో గతంలో తనకు లవర్ బాయ్ ఇమేజ్ ఉందని.. ఇప్పుడు మంచి నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు వరుణ్ సందేశ్ తెలిపారు.