సినిమాలన్నాక రొమాంటిక్ సన్నివేశాలు సర్వసాధారణం. అయితే ఆ సీన్ చేస్తుండగా హీరో, హీరోయిన్ ఇద్దరికీ గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వీళ్ళని అలా చూసేసరికి జనం ఆశ్చర్యపోయారు.
సినిమా షూటింగులన్నాక లో నటీనటులకు గాయాలవ్వడం అనేది మామూలే. రిస్కీ స్టంట్స్ చేసినప్పుడు కొన్నిసార్లు గాయాలు అవుతాయి. ఈ కారణంగా కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే బెడ్ సీన్ లో పాల్గొంటూ హీరో, హీరోయిన్ ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ప్రముఖ క్రికెటర్ అయిన షేన్ వార్న్ బయోపిక్ షూటింగ్ లో చోటు చేసుకుంది. షేన్ వార్న్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ స్పిన్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న షేన్ వార్న్ గత ఏడాది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో చెరగని ముద్ర వేసిన షేన్ వార్న్.. టెస్టులు, వన్డేల్లో వెయ్యికి పైగా వికెట్లు తీసి సత్తా చాటాడు. అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.
అయితే ఆటతో పాటు షేన్ వార్న్ జీవితంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. పలువురి మహిళలతో ఎఫైర్లు నడుపుతూ జల్సారాయుడిగా వార్తల్లో నిలిచేవాడు. అలాంటి షేన్ వార్న్ జీవిత కథ ఆధారంగా హాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. వార్నీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షేన్ వార్న్ లైఫ్ లో జరిగిన ముఖ్యమైన సంఘటనలను చూపించనున్నారు. క్రికెట్ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో వచ్చిన వివాదాలను ఇందులో చూపించనున్నారు. వార్నీ సినిమాలో షేన్ వార్న్ గా అలెక్స్ విలియమ్స్ నటిస్తుండగా, షేన్ వార్న్ సతీమణి సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తోంది. అయితే హాలీవుడ్ సినిమాల్లో శృంగార సన్నివేశాలు సర్వ సాధారణం. ఈ సినిమాలో కూడా శృంగార సన్నివేశాలు ఉన్నాయి.
ఈ క్రమంలో బెడ్ సీన్ లో నటిస్తుండగా హీరో, హీరోయిన్లు ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అలెక్స్ విలియమ్స్ తలకు, కెన్నెడీ మణికట్టుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై హీరోయిన్ కెన్నెడీ స్పందించింది. షేన్ వార్న్, సిమోన్ టీనేజ్ లో జరిగిన శృంగార సన్నివేశానికి సంబంధించి బెడ్ సీన్ ని చిత్రీకరించాల్సి ఉంది. ‘అందుకు మేము కారిడార్ లో నడుస్తూ వెళ్లి అక్కడి నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్లి అక్కడున్న బెడ్ పై పడిపోవాలి’ కానీ మేము బెడ్ పై పడకుండా కింద పడ్డామని కెన్నెడీ వెల్లడించింది. తన మణికట్టుకు, అలెక్స్ కి తలకు గాయమయ్యిందని ఆమె తెలిపింది. వెంటనే చిత్ర బృందం ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లింది అన్నారు. అయితే షూటింగ్ కాస్ట్యూమ్స్ లో హాస్పిటల్ కి వెళ్లడం వల్ల అందరూ వింతగా చూశారని కెన్నడీ చెప్పుకొచ్చింది.