సినిమాల్లో హీరో, హీరోయిన్లు వేసుకునే దుస్తులు ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆ కాస్ట్యూమ్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరో వేసుకున్న డ్రెస్ నచ్చితే అలాంటి మోడల్స్ మార్కెట్లోకి వచ్చేస్తుంటాయి. వాటిని ఫ్యాన్స్ ధరించి హీరోల్లా ఫీలైపోతుంటారు. అయితే షూటింగ్ అయిపోయాక హీరోలు, హీరోయిన్లు వేసుకున్న కాస్ట్యూమ్స్ ని ఏం చేస్తారో తెలుసా?
సినిమా అన్నాక హీరో, హీరోయిన్లు వేసుకునే కాస్ట్యూమ్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిస్టారికల్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాలకైతే కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. వీటి తయారీ ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. హీరో, హీరోయిన్లే కాదు ఆర్టిస్టులు కూడా కాస్ట్యూమ్స్ అనేవి ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటి కోసం లక్షలు ఖర్చు పెడతారు. మగధీర, రుద్రమదేవి, బాహుబలి వంటి సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. సాధారణ కమర్షియల్ సినిమాల్లో కూడా కాస్ట్యూమ్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రత్యేకంగా నిలిచిన సినిమాల్లో వాడిన వస్తువులను వేలం వేస్తుంటారు. కానీ అన్ని సినిమాలకు వేలం వేయరు. మరి వేలం వేయనటువంటి సినిమాలకు సంబంధించి కాస్ట్యూమ్స్ ని ఏం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?
చిన్నతనంలో వీళ్ళు క్షణాల్లో బట్టలు ఎలా మార్చుకుంటున్నారురా అని సందేహం వచ్చేది. కుర్రతనం పోలేదేహే అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. కాస్ట్యూమ్స్ అనేవి సినిమాకి ప్రధాన ఆకర్షణ. హీరో, హీరోయిన్లు చాలా కాస్ట్యూమ్స్ వాడతారు. ముఖ్యంగా పాటల్లో అయితే చాలా ఉంటాయి. అగ్నిపర్వతం సినిమాలో వన్ వన్ నంబర్ వన్ సాంగ్ కోసం సూపర్ స్టార్ కృష్ణ 10 కాస్ట్యూమ్స్ వేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొందరు హీరోలు కాస్ట్యూమ్స్ నచ్చితే జ్ఞాపకంగా తమ వెంట తీసుకెళ్లేవారన్న టాక్ ఉండేది. ఇప్పుడైతే ఆ ట్రెండ్ లేదు. మామూలు రెగ్యులర్ సినిమాలకైతే హీరో, హీరోయిన్లే షాపింగ్ చేసుకుంటున్నారు. ఏ బాహుబలినో, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమానో అయితే ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కాస్ట్యూమ్స్ ధరించాల్సిందే.
ఇక ఇలా ఒక సినిమా కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి దుస్తులు తీసుకొస్తారు. అయితే వాటిని సినిమా పూర్తయ్యాక వేరే సినిమా షూటింగ్ కోసం వాడతారు. అవును ప్రతీ సినిమా షూటింగ్ లోనూ దాదాపు వాడిన కాస్ట్యూమ్స్ నే వాడుతుంటారు. కాకపోతే ప్రేక్షకులు గుర్తుపట్టకుండా వాటిని వివిధ స్టైల్స్ లోకి మారుస్తారు. షూటింగ్ అయిపోయాక వాటిని ప్యాక్ చేసి భద్రపరుస్తారు. ఇతర షూటింగులకు అవసరమైతే వాటినే మళ్ళీ తీసి వాడతారు. హీరో, హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ ని గుర్తుపట్టకుండా మేనేజ్ చేసినట్టు.. మిగతా చిన్న చిన్న ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ ని పెద్దగా మార్పులు చేయరు. అందుకే చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ ఒకేలా ఉంటాయి. ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ వేసుకున్న డ్రెస్సు మరో సినిమాలో కనబడుతూ ఉంటుంది.
బుల్లితెర నటులైనా, సినిమా నటులైనా సరే కథకి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అనేవి ఉంటాయి. పోలీస్ డ్రెస్సులు, డాక్టర్ డ్రెస్సులు, లాయర్ డ్రెస్సులు, పని మనిషిగా కనిపించడానికి ఒక రకం డ్రెస్సు, కూలి వాడిగా, పేదవాడిగా కనిపించడానికి ఒక రకం, రాజు పాత్రకు, సైనికుల పాత్రలకు తగ్గట్టు రకరకాల డ్రెస్సులను ప్రొడక్షన్ హౌజ్ లే డిజైన్ చేస్తుంటాయి. వీటిని ప్రొడక్షన్ హౌజ్ లు అద్దెకు ఇస్తుంటాయి. హీరోయిన్లు, నటీమణుల జాకెట్లు వంటివి సరిపోకపోతే వారికి కరెక్ట్ గా సరిపోయేలా మార్పులు చేసి ఇస్తారు. అదన్నమాట విషయం. బోలెడంత ఖర్చు పెట్టి, క్రియేటివ్ గా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ని షూటింగ్ అయిపోయాక మళ్ళీ వేరే షూటింగ్ సమయంలో వాడుతుంటారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ అయినా సరే షూటింగ్ అయ్యాక భద్రపరిచి.. మళ్ళీ అలాంటి సినిమాలు వచ్చినప్పుడు బయటకు తీస్తారు. కొంతమంది అయితే సెకండ్స్ లో తక్కువ ధరకు మరి ఏ కాస్ట్యూమ్స్ ని షూటింగ్ అయ్యాక ఇంకా ఏం చేస్తారో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.