బాలకృష్ణ కోసం చిరంజీవి తన ఇంటిని ఇచ్చారా? ఈ ఇంట్లో బాలకృష్ణ చాలా రోజులు ఉన్నారు. చిరంజీవి ఎందుకు ఇచ్చారు? బాలకృష్ణ ఆ ఇంట్లో ఎందుకు ఉన్నారు?
చిరంజీవి, బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ టాప్ హీరోలుగా రాణిస్తున్నారు. వీరిద్దరికీ విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. వీరు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. అలాంటి సందర్భంలో ఎవరో ఒకరి సినిమా హిట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ హిట్ కొట్టేవారు. సినిమాల పరంగా ఎంత పోటీ ఉన్నా గానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరినొకరు విపరీతంగా గౌరవించుకుంటారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు గానీ చేస్తే చూడాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో ఒకే స్టేజ్ మీద చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు డ్యాన్స్ చేసి మేమంతా ఒకటే అని చాటి చెప్పారు. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్ మధ్య గొడవలు అనేవి ఉన్నాయి.
అయితే చిరు, బాలయ్యల మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఎంతలా కలిసిమెలిసి ఉంటారో చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బాలకృష్ణ కోసం చిరు తన గెస్ట్ హౌస్ ని వాడుకోమని ఇవ్వడం. బాలకృష్ణ అప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25 1990లో విడుదలైంది. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పిక్చరే ఇది. బాలకృష్ణ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇది. ఎందుకంటే ఇది బాలకృష్ణ 50వ సినిమా. ఈ సినిమా వచ్చి 33 ఏళ్ళు గడిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలా వరకూ చిరంజీవి గెస్ట్ హౌజ్ లోనే జరిగింది. అవును బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా షూటింగ్ చిరు ఇంట్లో జరిగింది.
1989 డిసెంబర్ 3న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. 90 శాతం షూటింగ్ చెన్నైలోని వెల్లిచ్చెరి ప్రాంతంలో ఉన్న చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే జరిగింది. ఈ గెస్ట్ హౌస్ పేరు హనీ హౌస్. ఇది చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఇల్లు. ఈ హౌస్ పక్కనే రెండెకరాల భూమి కూడా చిరంజీవిదే. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద క్లాస్ పిక్చర్. ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు. కానీ సూపర్ హిట్ కొట్టింది. అప్పట్లో బాలయ్య చేసిన ప్రయోగాల్లో ఇదొకటి. మాస్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఇలా క్లాస్ హీరోగా ప్రయోగం చేయడం అంటే మామూలు విషయం కాదు. బాలకృష్ణ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయిన 50వ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి చెన్నైలో ఉంటున్న తన ఇంటిని ఇచ్చారు. అలా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని వ్యక్తపరిచారు. మరి హీరోలు బానే ఉంటున్నా ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎందుకు? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.