పెళ్ళికి ముందు మోజులో పడి సరదాలు తీర్చుకుని.. తీరా పెళ్లి ఫిక్స్ అయితే ప్రియుడ్ని వదిలించుకోలేక భార్యలే ప్రియుడితో కలిసి భర్తలను హత్యలు చేసిన సంఘటనలు గతంలో చూసాం. అయితే ఇక్కడ పెళ్ళికి ముందు వధువు చేసిన ఆ ఒక్క తప్పు కారణంగా అమాయకుడు బలైపోయాడు. పెళ్ళైన మూడో రోజే అమ్మాయి భర్త మృతి చెందాడు. అయితే వరుడి మృతి వెనుక మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి సమయంలో బహుమతిగా వచ్చిన హోమ్ థియేటర్ పేలుడుకు సంబంధించిన కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఛత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలోని చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవి(22), అంజనా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లి అనంతరం వచ్చిన బహుమతులను వరుడు చూస్తున్నాడు. బహుమతుల్లో హోమ్ థియేటర్ ని ఆన్ చేయగా పేలుడు సంభవించి ఇంటి పై కప్పు, గోడ కూలిపోయాయి. ఈ ఘటనలో వరుడు, అతని సోదరుడు మరణించగా.. ఏడాదిన్నర చిన్నారి సహా ఏడుగురికి గాయాలు అయ్యాయి. అయితే విచారణ చేపట్టిన పోలీసులు పేలుడుకు కారణం బాంబు అని తేలింది. పక్కా ప్రణాళిక ప్రకారం హోమ్ థియేటర్ లో బాంబు పెట్టారని పోలీసులు తెలిపారు.
సర్జు మార్కం (33) అనే వ్యక్తిని హోమ్ థియేటర్ బాంబు అనుమానితుడిగా గుర్తించిన పోలీసులు విచారించగా అసలు విషయం బయట పడింది. సర్జుకి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే హేమేంద్రని పెళ్లి చేసుకున్న అంజనా మేరావి.. పెళ్ళికి ముందు నుంచి సర్జుతో కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉంది. అయితే హేమేంద్రతో పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఇక్కడితో రిలేషన్ షిప్ ని ఎండ్ చేద్దామని సర్జుకి చెప్పింది. అయితే పెళ్ళికి వారం రోజుల క్రితం అంజనా, సర్జుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సర్జు.. ప్రియురాలు అంజనా, హేమేంద్రల మీద పగ పెంచుకున్నాడు. ఇద్దరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని మాండై మార్కెట్లో హోమ్ థియేటర్ మ్యూజిక్ సిస్టం కొన్నాడు. పెట్రోల్ లో నానబెట్టిన రెండు కిలోల పేలుడు పదార్థాన్ని ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ లో పెట్టి హోమ్ థియేటర్ లో అమర్చాడు. స్విచ్ ఆన్ చేస్తే హోమ్ థియేటర్ పేలిపోయి వధూవరులిద్దరూ చనిపోయేలా బాంబు పెట్టాడు.
అయితే వరుడు, అతని సోదరుడు మాత్రమే చనిపోయారు. హోమ్ థియేటర్ కొన్న దుకాణం యొక్క పేరుని తెలుసుకుని ఆరా తీయగా సర్జు కొన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కి 100 కి.మీ. దూరంలో సర్జుని అదుపులోకి తీసుకున్నారు. హత్యా నేరం కింద సెక్షన్ 302, ఇతర సెక్షన్లతో అరెస్ట్ చేశారు. సర్జు ఇండోర్ లోని స్టోన్ మైన్స్ బ్లాస్టింగ్ విభాగంలో పని చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే సర్జు అంజనా, హేమేంద్రలను ఇద్దరినీ చంపాలని అనుకున్నప్పుడు పెళ్లికూతురు మిస్ అవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రలో ఆమె హస్తం ఏమైనా ఉందా? అని అనుమానిస్తున్నారు. మరి ఈ విషయంలో అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.