ఉన్నట్లుండి మీ ఫోన్ రింగవ్వుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. అవతలి వైపు నుండి.. స్వీట్ వాయిస్ తో హాయ్ అంకుల్ అంటూ అమ్మాయి మత్తుగా మాట్లాడుతుంది. అమ్మాయి కదా అని కాసేపు టైం పాస్ చేద్దాం అని చూశారా! మీరు పప్పులో కాలేసినట్లే. అంతా మాట్లాడాక అమ్మాయి చివరగా చెప్పేది ఇదే! అంకుల్ మీకు లాటరి తగిలింది.. ఆ డబ్బులు మీకు రావాలంటే.. మీరు కొంచెం అమౌంట్ ముందే చెల్లించాలి. ఓ కొంచెమేగా అంకుల్ సరే అంటాడు. రెండు రోజులయ్యాక అదే అమ్మాయి మళ్ళీ ఫోన్.. అంకుల్ అందుకు ఇంకొంచెం పే చేయాలి. అంకుల్ మళ్ళీ సరే అంటాడు.. అంతే ఇక అమ్మాయి, అంకుల్.. అంకుల్ అనడం. ఆయనేమో సరే.. సరే అనడం. అంతా అయిపోయాక అంకుల్ బోరున ఏడవడం. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుతుగుతున్నా మోసం చేసే తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఖైరతాబాద్ కు చెందిన ఓ మహిళ.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లాటరీ మోసానికి బలైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళకు రూ. 25 లక్షల లాటరీ గెలిచారని ఒక సందేశం వచ్చింది. ఆ మహిళ అత్యాశతో వెంటనే రెస్పాండ్ అయ్యింది. అంతే.. ఆ మాయగాడు, మహిళను తన మాయమాటలతో బురిడీ కొట్టించాడు. ఆ లాటరీ డబ్బులు మీకు రావాలంటే.. పలు రకాల ఛార్జీలు కట్టాలని ఆమెకు తెలిపాడు. అందుకోసం ఆ మహిళ అతను చెప్పినప్పుడల్లా కడుతూపోయి.. చివరకు రూ. 39 లక్షల వరకు చెల్లించింది.
ఇది కూడా చదవండి: Bengaluru: ఆ వ్యామోహంలో పడి భార్యను రోజు వేధించేవాడు.. చివరికి తట్టుకోలేకపోయాడు!
ఇక అంతా అయిపోయిందిగా లాటరీ డబ్బులు పంపమని అడిగింది. అయినా అతడు సమాధానం దాట వేయడంతో తాను మోసపోయానని గ్రహించి, బాధితురాలు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడు రాకేశ్‌ను బీహార్‌లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 16 సెల్‌ఫోన్లు, 73 డెబిట్ కార్డులు, 30 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా రాకేశ్ రూ. 3 కోట్ల వరకు ఇదే తరహాలో వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.