మద్యం ఫూటుగా తాగి, ఒంటి మీద సోయ కోల్పోయి కుటుంబ సభ్యులతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాగేందుకు డబ్బులివ్వాలని గొడవ చేయడం లేదా మందు కోసం గొడవకు దిగుతున్నారు. ఈ మద్యం కోసమే తన మూడో భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు.
మద్యం మత్తులో కొంత మంది ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. మద్యం ఫూటుగా తాగి, ఒంటి మీద సోయ కోల్పోయి కుటుంబ సభ్యులతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. తాగొచ్చి భార్యా బిడ్డలను, తల్లిదండ్రులను చితకబాదుతున్నారు. ఊరు, వాడ ఏకం చేసేలా రణరంగాన్ని సృష్టించి, పరువు పోయేలా రచ్చ చేస్తుంటారు. తాగేందుకు డబ్బులివ్వాలని గొడవ చేయడం లేదా మందు కోసం గొడవకు దిగుతున్నారు. రోడ్డు మీద తాగిందీ కాకుండా ఇంటి వచ్చి కూడా అందులోనే మునిగి తేలుతుంటారు కొందరు. ఈ మద్యం కోసమే తన మూడో భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది.
తాను తెచ్చుకున్న మద్యం తాగేసిందని భార్యను హత్య చేశాడో భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. పశ్చిమ బెంగాల్‌కు చెందిన డేపురాయ్, వసంతి పకాడియాతో కలిసి తమిళనాడులో నివాసం ఉంటున్నారు. కట్టలైకుళంలో ఉంటూ..ఇటుకబట్టిలో పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు మందు బాటిల్ ఇంటికి తెచ్చుకుని దాచి పెట్టుకున్నాడు. ఆ మద్యాన్ని అతడి మూడో భార్య తాగింది. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత ఏం జరగనట్లు నిద్రపోయాడు.
ఆ తర్వాతి రోజు ఉదయం లేచేసరికి రక్తపు మడుగుల్లో నిర్జీవంగా పడి ఉన్న భార్యను చూసి కంగారుపడ్డాడు. ఆ తర్వాత తాను దొరక్కుండా ఉండేందుకు.. భార్య శరీరం మీద.. నేల మీద పడిన రక్తపు మరకలను నీళ్లతో శుభ్రం చేశాడు. అయితే, ఇదంతా ఇటుక బట్టి యజమాని గమనించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డేపురాయిని అరెస్టు చేశారు. మద్యం తనకు తాగేందుకు లేదన్న కోపంతో భార్యను చంపాడని పోలీసులు తెలిపారు.