బిహార్‌లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తోన్న ఓ భవనంలో పేలుడు సంబవించింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఒక మహిళతో సహా ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. వివరాల్లోకి వెళితే..
బిహార్‌లో సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం షబీర్ హుస్సేన్ అనే బాణసంచా వ్యాపారి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. దాదాపు గంటపాటు పేలుళ్లు కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మూడంతస్తుల భవంతిలో ఒక పోర్షన్‌లో అక్రమంగా బాణసంచా తయారీ జరుగుతోందన్నారు. భారీ పేలుడు జరగడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగి భవనం చాలా భాగం కుప్పకూలిందని పోలీసు తెలిపారు.
నది ఒడ్డున ఉన్న ఈ ఇంట్లో బాణసంచా భారీగా ఉండటం వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఇక భారీ పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భవంతి నామరూపాలు లేకుండా మారిపోయింది. పై కప్పులు ఎగిరిపోయాయి. శిథిలాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మృతుల శరీర బాగాలు 50 మీటర్ల దూరంలో కనిపించాయి. మొత్తానికి అక్కడి వాతావరణం భయాణకంగా మారిందని స్థానికులు తెలిపారు.
స్థానికంగా జరిగే పెళ్లిళ్లకు టపాసులు సరఫరా చేయడమే గాక, ఇంట్లోనే అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం. పేలుడుకు కారణాలు విచారణలో తెలుస్తాయని సరన్ ఎస్‌పీ సంతోష్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించినట్టు తెలిపారు. అయితే, ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అవి పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన ఛాప్రాకు 30 కిలోమీటర్ల దూరంలో ఖొడియాభాగ్ గ్రామం ఉంది.
#Bihar:#Firecracker #factory in #Chapra #exploded,#Building #collapsed, so #far #six #people #died. #BiharNews #biharpolice pic.twitter.com/MR8MxSE6bA
— Shiv Kumar Maurya (@ShivKum60592848) July 24, 2022
ఇది కూడా చదవండి: వీడియో: పబ్ లో యువకుడిపై మహిళల దాడి.. చివరికి..
ఇది కూడా చదవండి: 28 మంది మహిళలు.. 500కు పైగా కండోమ్‌లు.. దడపుట్టిస్తున్న చీకటి వ్యభిచారం!