ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. కానీ.., ఇద్దరికి వచ్చిన ఓ ఐడియా మొత్తం ప్రపంచాన్నే మార్చేసింది. చాలా దేశాల్లో ఫుడ్ యాక్సిస్ చైన్ నే బ్రేక్ చేసింది. ఆ ఐడియా పేరే జొమోటోఫుడ్ సెర్చ్ ఇంజిన్. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా అనే ఇద్దరు సాధారణ కురాళ్ళ చేసిన ఆలోచన… ఈరోజున గ్లోబల్ అప్లికేషన్ గా ఎదిగి.., కొన్ని వేల కోట్ల టర్నోవర్ ని సృష్టిస్తోంది. 25కి పైగా దేశాల్లో ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇదంతా కూడా రాత్రికి రాత్రి జరిగిన అద్భుతం కాదు. ఈ విజయం వెనుక 13 సంవత్సరాల నిరంతర కష్టం ఉంది. మరి జొమోటో సక్సెస్ జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
2007… బయట ఫుడ్ తినడం అంటే ఎప్పుడో పండగకి, పబ్బానికి తప్ప ప్రజలకి పెద్దగా అలవాటు లేని రోజులు. ఎందుకంటే బయట మంచి ఫుడ్ తినాలంటే రెస్టారెంట్స్ కి వెళ్ళాలి. అక్కడ అన్నీ చార్జెస్ కలిపి బిల్ బోలెడు అయ్యేది. సరిగ్గా.. ఇలాంటి సమయంలో ఢిల్లో లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుని దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా అనే ఇద్దరు యువకులు బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.
పెట్టుబడిగా వారి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ.., తమ ఐడియాలతో డబ్బు సంపాదించగలం అనే నమ్మకం మాత్రం వారిలో ఉంది. ఆ గుండె ధైర్యంతోనే ఫుడీ బే ని స్థాపించారు. ఇందులో వివిధ రెస్టారెంట్స్ లో ఎలాంటి ఫుడ్ లభిస్తుందో తెలిపే మెనూ కార్డ్స్ స్కాన్ చేసి ఉంటుంది. దీని కారణంగా.., ఎక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుద్ధో సులభంగా తెలుసుకోవచ్చు. చాలా మంది రెస్టారెంట్స్ కి వెళ్లిన సమయంలో మెనూ కార్డు కోసం వెయిట్ చేసాయకుండానే.. ఫుడీ బే ద్వారా మెనూ తెలుకోవడం మొదలు పెట్టారు. ఇలా ఈ చిన్న ఐడియా.., విజయాన్ని సాధించింది.
కట్ చేస్తే 2010.. ఢిల్లీలోని బైనాన్ కోస్ న్యూ ఢిల్లీలోని ఆఫీస్. దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. జీవితంలో ఇంకా ఎదగాలన్న కసి వాళ్ళది. ఫుడీ బే సక్సెస్ వాళ్ళకి తృప్తిని ఇవ్వలేదు. అంతకుమించి ఏదో ఆలోచిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో పుట్టిన ఆలోచనే జొమోటో. ఫుడీ బేలో ఎలాగో ఏ హోటల్ లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందన్న సమాచారం ఉంది. ఆ ఫుడ్ ని నేరుగా ప్రజలకి అందిస్తే…! ఇదే వారి ఆలోచన.
కానీ.., దీనికి పెట్టుబడి కావాలి. వారి దగ్గర అంత డబ్బు లేదు. తమ ఐడియాని ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కి వివరించారు. చాలా మందికి దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా ఏమి చెప్తున్నారో కూడా అర్ధం కాలేదు. కొంతమంది ఇది జరగదు అని పెదవి విరిచారు. సరిగ్గా ఆ సమయంలో ప్రముఖ జాబ్ సెర్చ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ ఫౌండర్ సంజీవ్ జొమోటో ఐడియాని నమ్మారు. ఆయన వెంటనే 1 మిలియన్ యూ.ఎస్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత 3.5 మిలియన్ డాలర్లు, తరువాతి సంవత్సరం 10 మిలియన్ ఫండింగ్ వచ్చింది.
తమ ఆలోచనలకి ఆర్ధిక తోడ్పాటు కూడా జత కావడంతో దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా దూసుకుపోయారు. జొమోటోని మొబైల్ అప్లికేషన్ రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్నీ ప్రధాన నగరాల్లో నాణ్యమైన హోటల్స్ నుండి జొమోటో సర్వీస్ అందేలా ప్లాన్ చేసుకున్నారు. ఒక్క ఆర్డర్ తో తాము ఉన్న చోటకే కోరిన ఫుడ్ రావడం అనేది ప్రజలకి బాగా థ్రిల్లింగ్ గా అనిపించింది. అతి తక్కువ కాలంలోనే జొమోటో సూపర్ సక్సెస్ అయ్యింది.
జొమోటో ప్రస్తుతం 25కి పైగా దేశాల్లో తమ సర్వీస్ ని అందిస్తోంది. 100 మిలియన్స్ పైగా ఈ ఫుడ్ సెర్చ్ ఇంజిన్ కి యూజర్స్ ఉన్నారు. మొత్తం టర్నోవర్ రూ.3000 కోట్ల. ఇండియా నుండి వివిధ దేశాలకి వ్యాపించిన మొదటి గ్లోబల్ అప్లికేషన్ కూడా జొమోటోనే. ఇక రానున్న కాలంలో జొమోటోని మరిన్ని దేశాలకి విస్తరించాలని దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీగా చేరడానికి కూడా జొమోటో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈరోజు జొమోటో అంటే ఒక బ్రాండ్. గూగుల్ ఆఫ్ ఫుడ్. మరి చూశారు కదా..? జొమోటో సక్సెస్ జర్నీ ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.