కుటుంబ పోషణ కోసం చాలా మంది ఫుడ్ డెలివరీ కంపెనీల్లో చేరి ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ తమ కంపెనీల ద్వారా ఉపాధికల్పిస్తున్నాయి. కాగా జొమాటోలో డెలివరీ బాయ్ గా చేస్తున్న ఓ వ్యక్తి చంకన పిల్లాడితో, భార్య సైకిల్ నడుపుతుండగా ఇంటికి వెళ్తున్న దృష్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
సోషల్ మీడియా వచ్చాక సొసైటీలో జరుగుతున్న కొన్ని విషయాలకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు పుట్టించేవి అయితే మరికొన్ని మనసుకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇదే రీతిలో జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా, బాధ్యతలను పంచుకుంటూ, ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్న వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేవిధంగా ఉంది. బాధ్యతలతో కూడిన వారి బంధం మనసులను దోచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఏదోఒక పనిచేసి ఎలాగైన కుటుంబాన్ని పోషించేందుకు ఎంత కష్టమైన చేయడానికి సిద్ధపడతారు కొందరు. ఇదే విధంగా జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి సైకిల్ పై తిరుగుతు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. తన డ్యూటీ అయిపోయాక భార్యాబిడ్డతో కలిసి ఇంటికి బయలుదేరుతాడు. ఆ వ్యక్తి పిల్లాడిని భుజాన ఎత్తుకుని నడుస్తుండగా, అతని పక్కనే భార్య సైకిల్ నడుపుతూ ముందుకు వెళ్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ, భార్యా పిల్లల పోషణ కోసం కష్టపడుతున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్న భార్య, బాధ్యతలను పంచుకుంటూ కలిసి వెళ్తున్న వీడియో మనసులను కొల్లగొడుతుంది. భర్త డెలివరీ బాయ్ గా పనిచేస్తుండగా, భార్య పిల్లాడితో కలిసి పనికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి పనులు ముగిశాక ఇంటికి కలిసి వెళ్తూ, భర్త పిల్లాడిని ఎత్తుకోగా, భార్య సైకిల్ ను నడిపిస్తూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను స్వాతి మలివాల్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పోస్టు చేసింది. నువ్వుండగా నాకు మరేం కావాలి అనే పాటకు ఒరిజినల్ వీడియోగా ఇది ఉండాలని రాసుకొచ్చింది. ఈ వీడియో వారి అన్యోన్య దాంపత్య జీవితాన్ని, దంపతుల మధ్య ఉన్న ప్రేమానురాగాలను తెలియజేస్తుంది. ఈ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“Tu hai to mujhe fir aur kya chahiye”
This should be the official video of the song ❤️ pic.twitter.com/G9MQOnfW9x— Swati Maliwal (@SwatiJaiHind) July 7, 2023