ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేము, నాగులో నాగన్న’అని సాంగ్ ఇప్పటి పరిస్థితికి సరిగ్గా అతుకుతుంది. ఎందుకంటే ఉల్లి పాయ కోస్తేనే కాదూ కొన్నకూడా కన్నీళ్లే తెప్పిస్తుంది. ఇక టమాటా రేటు సామాన్యులకు టాటా చెబుతుంది
‘ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేము, నాగులో నాగన్న’అని సాంగ్ ఇప్పటి పరిస్థితికి సరిగ్గా అతుకుతుంది. ఎందుకంటే ఉల్లి పాయ కోస్తేనే కాదూ కొన్నకూడా కన్నీళ్లే తెప్పిస్తుంది. ఇక టమాటా రేటు సామాన్యులకు టాటా చెబుతుంది. కూరగాయలు కొందామంటే కొనలేని పరిస్థితి. సగటు మానవుడి జీతం మాత్రం ఇంత త్వరగా పెరగడం లేదు. జీవన ప్రమాణాల స్థాయి దిగజారుతుంది. నిత్యవసరాల ధరలతో పాటు గ్యాస్, పెట్రోల్, వంట నూనెల రేట్లు కూడా పెరుగుతున్నాయి. నూనె లేనిదే వంటింట్లో గరిట తిప్పడం కష్టం. వంట చేయకపోతే ఇంటిల్లిపాది పస్తులు ఉండాల్సిందే. ధరలు పెరుగుతున్న ఈ సమయంలో చల్లటి కబురు ఒకటి వినిపిస్తుంది.
వంట నూనె ధరలు భారీగా తగ్గనున్నాయట. దీనికి కారణం దిగుమతులు పెరగడమే. ఇండోనేషియా, మలేషియా నుండి ఇబ్బడిమబ్బడిగా దిగుమతులు జరుగుతున్నాయి. దేశంలో జూన్లో పామాయిల్ దిగుమతులు ఏకంగా 49 శాతం కన్నా ఎక్కువ నమోదయ్యాయి. మేతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. జూన్లో 655000 మెట్రిక్ టన్నులు ఆయిల్ దిగుమతి కాగా, మేలో 439173 మెట్రిక్ టన్నులు నూనె దిగుమతి అయ్యింది. గత 3 నెలలను బట్టి చూస్తే ఇదే గరిష్టం. ఈ నేపథ్యంలో నూనె ధరలు దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూనె ధరలు పడిపోవడం వల్ల డీలర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏక కాలంలో, పెద్ద మొత్తంలో ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నారు. సోయా ఆయిల్, సన్ ఫ్లవర్ నూనెతో పోలిస్తే పామాయిల్ రేటు ఎక్కువగా తగ్గింది. ఈ కారణంతోనే డీలర్లు కూడా ఈ ఆయిల్వైపే మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు మిగిలినఆయల్ ధరలు కూడా తగ్గే అవకాశాలున్నాయని తెలుస్తోంది.