ముఖేష్ అంబానీ.. ఐశ్వర్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. వేల కోట్ల సంపదతో.. మన దేశంలోనే కాక.. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మన దేశంలో.. రిలయన్స్ అడుగుపెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. బట్టలు మొదలు.. పెట్రోల్ బంకుల వరకు.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు ముఖేశ్ అంబానీ. దేశంలోనే టాప్ మోస్ట్ బిజినెస్‌మ్యాన్‌గా రాణిస్తున్నాడు. కుమారులిద్దరూ, కుమార్తె.. కూడా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములయ్యి.. తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వృత్తిగత జీవితం గురించి కాసేపు పక్కన పెడితే.. వారి వ్యక్తిగత జీవితం గురించి కూడా మీడియాలో బోలేడు వార్తలు వస్తుంటాయి. ఇక అంబానీ ఇంట చిన్న ఫంక్షన్ అయినా సరే.. ఎంత ఘనంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కుమార్తె ఇషా అంబానీ వివాహ సందర్భంగా ఏకంగా 200 కోట్లు ఖర్చు చేశాడు అంబానీ. ఇక తాజాగా అంబానీ ఇంట.. అంగరంగ వైభవంగా మరో వేడుక జరిగింది. ఆ వివరాలు..
తండ్రికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అంటారు. ఈ విషయంలో ముఖేష్ అంబానీ కూడా.. మిగతా వారికి భిన్నం కారేమో అనిపిస్తారు. ఎందుకంటే.. కుమార్తె ప్రేమించినవాడితో.. అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఆ వేడుకకు ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అంబానీ. కుమార్తె అంటే తనకు ఎంత ప్రేమో మరోసారి వెల్లడించాడు అంబానీ. కుమార్తె, ఆమె బిడ్డలను ఇండియాకు ఆహ్వానించడం కోసం ప్రత్యేక విమానం వంటి ఏర్పాట్లు చేయడమే కాక.. నివాసం దగ్గర ఘనంగా ఏర్పాట్లు చేశాడు. అన్నింటికి మించి ఈ శుభ సందర్భంలో.. ఏకంగా 300 కేజీల బంగారం దానం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖేష్ అంబానీ కుమార్తె.. ఇశా అంబానీ, ఆనంద్ పిరమళ్ దంపతులకు నవంబర్ 19 న కవలలు జన్మించారు. వీరిలో ఒకరు పాప.. ఒకరు బాబు. చిన్నారికి ఆద్య.. బాబుకి కృష్ణ అని పేర్లు పెట్టారు. లాస్ ఏంజెల్స్‌లో ఇశా అంబానీ డెలివరీ అయింది. బిడ్డలకు జన్మనిచ్చిన నెల రోజుల తర్వాత.. తొలిసారి ఇండియాకు వచ్చింది ఇశా అంబానీ. ఈ క్రమంలో కుమార్తె, మనవడు, మనవరాలికి ఘనంగా స్వాగతం పలికారు ముఖేష్ అంబానీ దంపతులు. అంతేకాక.. వారసులు వస్తున్న నేపథ్యంలో.. ఇటు ముఖేష్ అంబానీ నివాసం అంటిల్లా రెసిడెన్స్, అటు పిరమళ్ నివాసం.. కరుణ సింధులను అందంగా అలంకరించారు. బాజాబజంత్రీల నడము.. వారసులను ఆహ్వానించారు ముఖేష్ దంపతులు.
ఇక ఇశా అంబానీ.. చిన్నారులను తీసుకుని.. లాస్ ఎంజిల్స్ నుంచి ఇండియాకు వచ్చే క్రమంలో.. ఖతార్ ప్రభుత్వం.. వారికోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఎమిరేట్స్‌తో అంబానీకి సత్సంబంధాలుండటం వల్లే ఇలా ప్రత్యేక విమానాన్ని పంపింది. ఈ విమానంలో.. ఇశా అంబానీతో పాటు.. అమెరికాలోనే బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ గిబ్సన్ కూడా వీరితో పాటు ఉన్నారు. ఇక శిశువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వీళ్లంతా నిత్యం పర్యవేక్షించారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న అమెరికన్ నర్స్‌లూ వీరితో పాటు ఉన్నారు. పిల్లల బాగోగులు చూడటం కోసం ఎనిమిది మంది ప్రత్యేక అమెరికన్ ఆయాలు కూడా వీరితో పాటు వచ్చారు.
ఇక వారసులు వచ్చిన నేపథ్యంలో.. ముఖేష్ అంబానీ డిసెంబర్ 25న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చిన్నారులను ఆశీర్వదించేందుకు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు చెందిన పూజారులను పిలిపించింది అంబానీ కుటుంబం. వీరు చిన్నారులను ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందిచనున్నారు. అలానే దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలైన తిరుపతి బాలాజీ, నాథ్‌ద్వారా శ్రీనాథ్ జీ,శ్రీ ద్వారకాధీశ్ టెంపుల్స్ నుంచి ప్రసాదాలూ తెప్పిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా.. పెద్ద మొత్తంలో విరాళాలూ ఇస్తారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వారసులు వచ్చిన సందర్భంగా అంబానీ కుటుంబం.. ఏకంగా 300 కిలోల బంగారాన్ని దానం చేయనుందట. ఇక చిన్నారులు ధరించే దుస్తులు తయారు చేసేందుకు.. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మూడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్.. ఇప్పటికే బిడ్స్ కూడా వేశాయట. మరి మనవడు, మనవరాలి కోసం అంబానీ కుటుంబం చేస్తున్న ఈ ప్రత్యేక ఏర్పాట్లు, కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.