బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్ అధినేతగా ప్రపంచ కుబేరుల్లో ఆయనది ఐదో స్థానం. ఇలాంటి అపర కోటీశ్వరులు.. తమ సొంత కంపెనీ ఫోన్లు లేదా ఐఫోన్ వాడతారనేది అందరి ఊహ. అయితే.. అందుకు తాను విభిన్నమని చెప్పిన బిల్ గేట్స్.. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నానని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందరూ.. తమ తమ కంపెనీ ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేయాలని భావిస్తుంటే.. బిల్ గేట్స్ ఏంటి? ఇలా అసలు విషయాన్ని బయటపెట్టేశారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఫోనే వాడేవారు. ఇప్పుడు ఆ ఫోన్ ఆగిపోవడంతో ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారట. అదీ మైక్రోసాఫ్ట్ ఫీచర్లు ఎక్కువ ఉండే ఫోన్ వాడుతున్నానని చెప్పుకొచ్చారు. రెడిట్ లో ఎదురైన ప్రశ్నకు సమాధానిస్తూ.. ‘శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3‘ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టు చెప్పారు. “నా దగ్గర ఆండ్రాయిడ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఉంది. నేను డిఫరెంట్‌గా ప్రయత్నిస్తుంటాను. స్క్రీన్ పెద్దగా ఉండడంతో పోర్టబుల్ పీసీలా.. ఈ మొబైల్ ఉపయోగపడుతుంది” అని బిల్ గేట్స్ సమాధానమిచ్చారు. మైక్రోసాఫ్ట్‌తో శాంసంగ్ భాగస్వామ్యం ఉండడం కూడా గేట్స్.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 వాడుతుండడానికి ప్రధాన కారణంగా ఉంది. స్కైప్, టీమ్స్, ఎంఎస్ వర్డ్, అవుట్‌లుక్ మెయిల్ యాప్ వంటివి ఎక్కువగా వాడే బిల్‌గేట్స్ వాటిని ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే వాడడం ఈజీ అని డిసైడవడం గొప్పవిషయం.
Instead of a #Microsoft (@Microsoft) Surface Duo, the tech giant’s founder #BillGates (@BillGates) has revealed he uses #Samsung Galaxy Z Fold 3 as his daily smartphone. pic.twitter.com/ebpIv6Rysc
— IANS (@ians_india) May 21, 2022
ఇది కూడా చదవండి: TRAI: ఇకపై కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా.. ఎవరు చేశారో తెలిసిపోతుంది!
బిల్‌గేట్సే కాదు ఆయన ఇంట్లో ఎవరూ ఐఫోన్ వాడరట. ఈ విషయాన్నీ ఆయనే చెప్పారు. ఐఫోనే కాదు.. యాపిల్ ప్రొడక్ట్స్ ఏవీ వాళ్లింట్లో వాడరట. బిల్‌గేట్స్ అంటే అనుకోవచ్చు.. ఆయన పిల్లలు కూడా ఐఫోన్, ఐ పాడ్‌లాంటి యాపిల్ ప్రొడక్ట్స్ వాడకపోవడం విశేషమే మరి. ఐఫోన్ ఎందుకు వాడడంలేదంటే ప్రత్యేకంగా కారణమేమీ లేదు కానీ నాకే కాదు మా ఇంట్లో ఎవరికీ యాపిల్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం లేదని చెప్పారు. అయితే యాపిల్ ప్రొడక్ట్స్.. ముఖ్యంగా ఐ ఫోన్ ప్రగతిని, యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ చనిపోయాక కూడా ఆ ఫోన్ తన లెగసీని కోల్పోకుండా కంటిన్యూ కావడం గొప్ప విషయమని ఎప్రిషియేట్ చేయడం మరో ట్విస్ట్. మరి బిల్ గేట్స్.. తన సొంత కంపెనీ ప్రొడక్ట్స్ కాదని వేరే బ్రాండ్ ఫోన్ వాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Samsung Galaxy Z fold 3 all specifications by @Paperandtech1 #paperandtech#SamsungUnpacked #SamsungGalaxyZFold3 pic.twitter.com/xxdY4AleAv
— Paperandtech.in 🌐 (@Paperandtech1) August 12, 2021