కొత్త ల్యాప్ టాప్ అయినా, కొత్త స్మార్ట్ ఫోన్ అయినా సరే సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ. 50 వేల ల్యాప్ టాప్ ని రూ. 30 వేలకు, రూ. 25 వేలకు కొనే అవకాశం ఉంది. అలా అని సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ కాదండోయ్. కొత్తదే. బాగా పని చేసేదే. స్మార్ట్ ఫోన్ అయినా సరే సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. అదెలాగో మీరే చూసేయండి.
ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్.. ఈ రెండూ కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు ల్యాప్ టాప్ కొనాలనుకుంటే.. చదువు, ఉద్యోగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటారు. అయితే కొన్ని కంపెనీలు వెయ్యి, 2 వేలు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే 5 వేల వరకూ క్యాష్ బ్యాక్ లు వస్తుంటాయి. ఎక్స్ ఛేంజ్ లో అయితే భారీ తగ్గింపుతో వస్తాయి. అయితే ఎక్స్ ఛేంజ్ లో కొనడానికి ముందు మన దగ్గర ల్యాప్ టాప్, ఫోన్ ఉంటే కదా. ఫోన్ ఉన్నా ల్యాప్ టాప్ అనేది లేకపోతే ఎక్స్ ఛేంజ్ లో ఎలా కొనగలుగుతాం. సరే డైరెక్ట్ గా ఈ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు కాకుండా.. సగం ధరకే ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లు కొనడం ఎలా?
మీరు ఒక ల్యాప్ టాప్ కొనడానికి షోరూంకి వెళ్తారు. అక్కడ షోరూంలో కొన్ని రకాల డెమో ల్యాప్ టాప్స్ డిస్ప్లేలో ఉంటాయి. మీరు వాటిని చూసి ల్యాప్ టాప్ కొనాలి అని అనుకుంటారు. అలా చేస్తే మీరు దాని ధర ఎంత ఉంటే అంతా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు ఆ డిస్ప్లేలో ఉన్న ల్యాప్ టాప్ ని కొనుగోలు చేస్తే గనుక సగం ధరకే కొనవచ్చునన్నమాట. డెమో ల్యాప్ టాప్స్ ని కొన్ని షోరూంల వాళ్ళు 40 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్ తో విక్రయిస్తుంటారు. ఆ మోడల్స్ లో అన్నీ అమ్ముడైపోతే.. డెమో పీస్ ఒక్కటే మిగిలినప్పుడు సగం ధరకు అమ్ముతారు. ఉదాహరణకు ఎక్స్ అనే ల్యాప్ టాప్ మోడల్ ఉంది. దీని ధర రూ. 50 వేలు అనుకుందాం.
ఈ ఎక్స్ అనే ల్యాప్ టాప్స్ ని అమ్మడం కోసం డిస్ప్లేలో ఒక డెమో ల్యాప్ టాప్ పెడతారు. ఈ ఎక్స్ అనే మోడల్ ల్యాప్ టాప్ లు అన్నీ అమ్ముడైపోతే చివరిగా డెమో పీస్ మిగులుతుంది. దీన్ని షోరూం వాళ్ళు విక్రయిస్తుంటారు. మీరు షోరూం వాళ్ళని సంప్రదించి డెమో పీస్ ని సగం ధరకు గానీ, అంతకంటే తక్కువకు గానీ సొంతం చేసుకోవచ్చు. ఇలానే స్మార్ట్ ఫోన్లను కూడా సొంతం చేసుకోవచ్చు. అలా అని ఇవి సెకండ్ హ్యాండ్ వస్తువుల కిందకు రావు. ఎందుకంటే వచ్చిన కస్టమర్లు చూస్తారు తప్ప వీటిని వాడరు. కొత్త లాప్ టాప్ లానే ఉంటుంది. నలుగురూ చేతులు వేశారన్న కొంచెం అసంతృప్తి తప్పితే పెర్ఫార్మెన్స్ లో ప్రాబ్లమ్ అనేది ఉండదు.
కొత్త ల్యాప్ టాప్ కొంటే ఎలా అయితే వారంటీ ఉంటుందో అలానే దీనికి కూడా వారంటీ అనేది ఉంటుంది. డబ్బులు ఊరికే రావు, ధర తగ్గాలి అని అనుకుంటే గనుక ఇదొక ఉత్తమ మార్గం. చాలా మంది ఇలానే డెమో ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. వాళ్ళు సంతృప్తిగా ఉన్నట్లు పలు వెబ్ సైట్స్ లో రేటింగ్స్ చెబుతున్నాయి. ఆన్ లైన్ లో రిటర్న్ ఇచ్చిన ఫోన్లను, ల్యాప్ టాప్ లను రీఫర్బిష్ చేసి, రెన్యూవ్డ్ గా చాలా తక్కువ ధరకు అమ్ముతారు. అయితే వీటికి వారంటీ అనేది ఉండదు. కానీ డెమో పీస్ లకు మాత్రం వారంటీ అనేది ఇస్తారు. డెమో ల్యాప్ టాప్ లే అయినా 5 ఏళ్ల వరకూ బానే పని చేస్తాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి బాగా అధ్యయనం చేసి కొనడం మంచిది.