స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్స్ ఏవి కొనుగోలు చేయాలన్నా సాధారణ రోజుల్లో కంటే ఆఫర్స్ ఉన్న సమయంలోనే తక్కువ ధరకు లభిస్తాయి. అయితే ఆ ఆఫర్స్ లో ఏ ఫోన్ కొనాలి? ఎంత ధరలో కొనాలి? అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. మీకు ఇప్పుడు ఒక అదిరిపోయే స్మార్ట్ ఫోన్ గురించి చెప్పబోతున్నాం.
ఫోన్ అంటే ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ నే కొనుగోలు చేస్తున్నారు. అందులో కూడా 5జీ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఫోన్ కొనాలి అనుకుంటే ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా మంచి ఆఫర్స్ సేల్స్ ఉన్నప్పుడు కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే అప్పుడు అవి మీకు చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి. అలాగే డీల్స్ మంచి ఫోన్లను కూడా అతి తక్కువ ధరలో కొనుగోలు చేయచ్చు. అలాంటి ఒక డీల్ ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం. ఇందులో మీకు రూ.75 వేల విలువైన 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.25 వేలకే లభిస్తోంది. ఇంత మంచి ఆఫర్ మీకు మళ్లీ దొరకదనే చెప్పాలి.
ఇప్పుడు చెప్పుకోబోయేది శాంసంగ్ గ్యాలెక్సీ సిరీస్ కి చెందిన S20 FE 5G ఫోన్ గురించి. దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.5 ఇంచెస్ 120 హెట్జ్ ఆమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ఉంది. ఈ డిస్ ప్లేతో మీరు ఓటీటీ కంటెంట్ ని, గేమింగ్ కి సంబంధించి ఎంతో మంచి ఎక్స్ పీరియన్స్ ని పొందవచ్చు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. దీనితో మీరు మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ని పొందవచ్చు. ఇందులో ప్రో గ్రేడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. నైట్ టైమ్ లో కూడా ఎంతో క్లియర్ గా మీరు ఫొటోలు తీసుకోవచ్చు. ఇందులో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఐపీ68 వాటర్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీ ఉంది.
ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.. 8 జీబీ ర్యామ్+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. హెవీగా ఫోన్ వాడేవారికి, గేమర్స్ కు, వీడియో కంటెంట్ ఎక్కువగా చూసే వారికి, సెల్ఫీలు, ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారికి ఈ ఫోన్ ఎంతో చక్కగా పనికొస్తుంది. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.74,999 కాగా సేల్ లో కేవలం రూ.24,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ సేల్ మే 4నుంచి ప్రారంభం అవుతుంది. కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు ఈ ఫోన్ మీ విష్ లిస్టులో యాడ్ చేసుకుని మే4వ తారీఖున కొనుగోలు చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్20 ఎఫ్‌ఈ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.