గుంటూరులో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఏ ఏ ఏరియాలో ఫ్లాట్ గానీ స్థలం రేట్లు గానీ యావరేజ్ గా ఎంత ఉన్నాయన్నది తెలుసుకోండి.
ల్యాండ్ రేట్లు అనేవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడో కొన్ని ఏరియాల్లో ప్రతికూల పరిస్థితులు కారణంగా తగ్గుతాయి తప్పితే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పనే. ఫ్లాట్ కొనాలన్నా, ఇండ్ల స్థలం కొనాలన్నా గానీ లాభం ఏంటి అన్నది ఆలోచించుకోవాలి. ఒక ఏరియాలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటే ఆ ఏరియాలో దాని ధర ఎంత ఉంది? వృద్ధి రేటు ఎంత ఉంది? అనేది చూసుకోవాలి. అలానే ఇండ్ల స్థలం కొన్నా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి. ల్యాండ్ వేల్యూ అనేది తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వైజాగ్, విజయవాడ తర్వాత గుంటూరు ఉంది. గుంటూరులో ఫ్లాట్ లేదా స్థలం కొనుక్కోవాలని అనుకుంటే గనుక యావరేజ్ గా ఇక్కడి ఏరియాల్లో రేట్లు ఎలా ఉన్నాయన్నది పరిశీలించండి.
పైన తెలుపబడిన ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ లైనా, ఇండ్ల స్థలాలైనా యావరేజ్ గా ఆ రేట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రేట్లు ఉంటాయని చెప్పలేము. ఆ ధరలకు అటూ, ఇటుగా ఉంటాయి. అయితే గుంటూరులోని ఇల్లు కొనడానికి లేదా స్థలం కొనడానికి మోస్ట్ పాపులర్ ఏరియాలుగా మంగళగిరి, అమరావతి, గోరంట్ల, బాపట్ల, బ్రాడిపేట ప్రాంతాలు ముందు వరుసలో ఉన్నాయి. ఉదాహరణకు మంగళగిరిలో 150 గజాల ఇండ్ల స్థలం కొనాలంటే గనుక కనీసం రూ. 27 లక్షలు ఖర్చు అవుతుంది. అదే అపార్ట్మెంట్ లో 150 గజాల విస్తీర్ణం గల ఫ్లాట్ కొనాలంటే గనుక రూ. 55,35,000 అవుతుంది. ఇదే మంగళగిరిలో 150 గజాల విస్తీర్ణంలో ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే గనుక రూ. 62 లక్షల వరకూ అవుతుంది.
అమరావతి, గోరంట్ల, బాపట్ల సహా ఇతర ఏరియాల్లో కూడా రేట్లు ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ఇండ్ల స్థలాల విషయంలో గత ఏడాదిలో నంబూరు ప్రాంతం 83 శాతం, అమరావతి 35 శాతం పెరిగింది. చిలకలూరిపేట 5.9 శాతం పెరిగింది. ఈ ఏరియాల్లో స్థలాలు కొనుక్కోవడం ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు. నల్లపాడు, గోరంట్ల ఏరియాలు మాత్రం గత ఏడాదిలో 6.1, 40.4 శాతం తగ్గాయి. ఫ్లాట్ ధరల విషయానికొస్తే.. విద్యానగర్ 24.7 శాతం, కొలనుకొండ 12.1 శాతం, మంగళగిరి 9.3 శాతం, గోరంట్ల 6.1 శాతం పెరిగాయి. బ్రాడిపేట మాత్రం 9 శాతం తగ్గాయి. ఫ్లాట్ కొనాలనుకునేవారు విద్యానగర్, కొలనుకొండ, మంగళగిరి ప్రాంతాలను ఎంచుకోవడం ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. అయితే స్థలాలు గానీ ఫ్లాట్లు మీద గానీ పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి పదిసార్లు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మంచిది.
గమనిక: ఈ ధరలు కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దొరికిన ప్రాంతాల ధరల డేటా ఆధారంగా ఇవ్వబడింది. అసలు ఖచ్చితమైన ధరల కోసం రియల్ ఎస్టేట్ ఏజెన్సీలను, యజమానులను సంప్రదించవలసినదిగా మనవి. ఈ ధరల్లో ప్రాంతాలను బట్టి, విక్రయించే వారిని బట్టి హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. గమనించగలరు.