టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న రిలయన్స్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టారిఫ్ ల విషయంలో గానీ, నెట్వర్క్ విషయంలో గానీ ఎంతో పురోగతిని సాధించింది. అటు జియో ఫైబర్ పేరిట ఇంటర్నెట్ సేవలను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో మిగిలిన టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కు రిలయన్స్ సంస్థ ఎంత పోటీనిస్తోంది చూస్తున్నాం. ఈ పోటీ వ్యాపార ప్రపంచంలో ముందుకెళ్లాలి, టాప్ ప్లేస్ లో నిలవాలంటే వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్స్ ఇస్తూ వెళ్లాలి. ఆ విషయంలో రిలయన్స్ సంస్థ ఎప్పడూ ముందుంటుందని అందరికీ తెలిసిందే. తాజాగా ఆ సంస్థ జియో ఫైబర్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఆఫర్ ఏంటంటే.. ‘జియో ఫైబర్ ఎంటర్ టైన్మెంట్ బొనాంజా’ పేరిట కొత్త ప్లాన్ ను పరిచయం చేశారు. జియో ఫైబర్ లో 399 రూపాయల నుంచి 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ ప్లాన్స్ మొదలవుతాయి. ఆ ప్లాన్ కు అదనంగా రూ.100/200 చెల్లించడం ద్వారా అదనంగా ఓటీటీ యాప్స్ కు యాక్సెస్ పొందవచ్చు. 100 చెల్లిచండతో 6 యాప్స్, 200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ పొందే అవకాశం కల్పిస్తున్నారు. దీనిని పోస్ట్ పెయిడ్ ప్లాన్ గా పరిచయం చేస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి అమలులోకి రానుంది. కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకే కాకుండా.. ఇప్పటికే జియో ఫైబర్ కలిగి ఉన్న వినియోగదారులు సైతం ఈ ప్లాన్ ను ఎంచుకునే అవకాశం కల్పించారు.
జియో ఫైబర్ ఎంటర్‌టైన్మెంట్ బొనాంజా ఎలా తీసుకోవాలంటే..
ముందుగా వినియోగదారులు మై జియో యాప్ లో మీ ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లాన్‌కు సంబంధించిన అడ్వాన్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అదే పాత వినియోగదారులు అయితే.. మై జియో యాప్‌లో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మైగ్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ ప్లాన్ ను ఎంపిక చేసుకుని అడ్వాన్స్ పేమెంట్ చెల్లిచాల్సి ఉంటుంది. జియో ఫైబర్ అందిస్తున్న ఈ బొనాంజా ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Jio Fiber Entertainment Bonanza.. High speed internet, HD voice calling local+STD..550+ live channels + 14 OTT apps.. Now everything starts from 499/Month..
No installation charges..No security deposit..
Call for booking:6283453006 pic.twitter.com/X72sq6mNSf— Utkarsh mishra (@Utkarsh65296042) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.