ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి సమయం దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. అయితే.. ఐటీఆర్ గురుంచి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. మాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం మేము రిటర్న్ ఫైల్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఐటీ రిటర్న్ అనేది కేవలం ఉద్యోగులు, కోటీశ్వరులు, వ్యాపార వేత్తలకు మాత్రమే కాదు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం అలవాటు చేసుకోవాలి. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే.. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ, చట్టపరమైన చర్యల నుంచి బయటపడొచ్చు. ఈ నేపథ్యంలో గడువులోగా ఐటీ రిటర్స్ ఫైల్ చేస్తే వచ్చే లాభాలు, ఫైల్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి ఒకసారి చూద్దాం.
ఐటీ రిటర్స్ ఫైల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
సులభంగా బ్యాంకు రుణాలు
మీరు వింటున్నది నిజమే.. ఐటీ రిటర్స్ ఫైల్ చేయడం వల్ల.. లోన్ పొందడం సులభం. ఈ రోజుల్లో చాలా వరకూ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు.. లోన్ ఇచ్చేందుకు ఐటీ రిటర్న్ లను ప్రామాణికంగా భావిస్తున్నాయి. ఆదాయానికి రుజువుగా ఐటీఆర్ స్టేట్మెంట్ కాపీని అందించాలని బ్యాంకులు కోరుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల మీరు ITR ఫైల్ చేయడం ద్వారా, మీరు భవిష్యత్తులో కారు లోన్ లేదా హోమ్ లోన్ సహా మరే ఇతర రకాలైన లోన్స్ కోసం అప్లై చేసుకున్నట్లయితే మీకు కచ్చితంగా ITR సహాయ పడుతుంది.
విదేశీ వీసా పొందడం సులభం
వీసాలను పొందే విషయంలో కూడా ఐటీఆర్ ఫైలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరగా వీసా పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ ఫైలింగ్ క్రమం తప్పకుండా చేయాలి. వీసాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ హిస్టరీ సమర్పించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది.
టీడీఎస్ రిటర్న్ పొందే వీలు
ఈ మధ్య కాలంలో చాలా సంస్థలు మీకు చెల్లించే డబ్బులో టీడీఎస్(టాక్స్ డిడక్షన్ అట్ సోర్స్) కట్ చేస్తున్నాయి. అయితే టీడీఎస్ కింద కట్ అయిన సొమ్మును ఎలా పొందాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అయితే టీడీఎస్ ద్వారా కట్ అయిన సొమ్మును మీరు ఐటీ రిటర్న్ చేసినప్పుడు పొందవచ్చు.
సాధారణంగా మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినప్పటికీ, మీ ఆదాయంలో కొంత మొత్తం కచ్చితంగా TDS కింద కట్ చేస్తుండడం సహజం. అలాంటి పరిస్థితుల్లో, మీరు ITR ఫైల్ చేసినప్పుడు మాత్రమే TDS కింద కట్ అయిన డబ్బును మీరు వాపసు పొందొచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మాత్రమే ఆదాయపు పన్ను శాఖ మీ టీడీఎస్ ను పోర్టల్ లో మీరు అనుసంధానించిన బ్యాంకులో జమచేస్తుంది.
ఐటీ రిటర్స్ ఫైల్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు
పెనాల్టీ
గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 10 వేల రూపాయల దాకా జరిమానా, ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 23ఘే కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించాలి.
చట్టపరమైన చర్యలు
ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైనా లేదా డిఫాల్ట్ అయినా, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది. ఈ నోటీసులకు మనమిచ్చిన సమాధానంతో ఐటీ డిపార్ట్మెంట్ సంతృప్తి చెందకపోతే.. మన ఆదాయంలో ఏమైనా లోపాలు ఉన్నట్టు గమనిస్తే చట్టపరమైన కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక: ప్రతి ఒక్కరూ తమ వార్షిక ఆదాయం పరిమితిని మించి ఉంటే పన్ను చెల్లించాల్సిందే. శ్లాబ్ సిస్టమ్ ప్రకారం ఆదాయం పన్ను విధిస్తారు. ఆదాయం పెరిగినా కొద్దీ, పన్ను రేట్లలో మార్పులు వస్తాయి. ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదాయపు పన్నుశాఖ పోర్టల్ www.incometaxindiaefiling.gov.in వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. మీకు ఖాతా లేకుంటే, మీ పాన్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి. ఇదే మీ ఐడీ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపసంలో తెలియజేయండి.
The earlier you file your ITR, the more you can relax!
ITR filing for AY 2022-23 is available on e-filing portal.
Be an early filer & avoid the last minute rush. #FileNow
Pl visit https://t.co/GYvO3n9wMf #ITR pic.twitter.com/Lh6ZCk3bsL— Income Tax India (@IncomeTaxIndia) July 8, 2022
ఇది కూడా చదవండి: Business: ఈ బిజినెస్ తో సొంత ఊర్లోనే నెలకు రూ.50వేల ఆదాయం!
ఇది కూడా చదవండి: LIC: రూ. 253 పొదుపుతో రూ.54 లక్షలు మీ సొంతం.. ఒక్క పాలసీతో ఎన్నో లాభాలు!