లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి).. ఈ సంస్థ భారతదేశంలో ఉన్న అతిపెద్ద బీమా కంపెనీలలో ఒకటి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అవ్వడం వల్ల దీనిపై ప్రజలకు నమ్మకం కూడా ఎక్కువ. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్ఐసి కూడా సురక్షితమైన, రిస్క్ లేని ఉత్తమమైన పాలసీలను ప్రవేశపెడుతూ పాలసీ దారులను ఆకర్షిస్తోంది. ఎల్ఐసీ ప్లాన్ తీసుకోవడం వల్ల కేవలం రాబడి మాత్రమే కాకుండా కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. అంటే రక్షణ, రాబడి రెండూ ఉంటాయి. ఇంకా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా సొంతం చేసుకోవచ్చు. అలాంటి పాలసీల్లో ఉత్తమమైనది.. ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ అనేది బీమాపై పొదుపు ఎంపికతో కూడిన ఎండోమెంట్ పాలసీ. ఈ పాలసీ తీసుకున్న తర్వాత.. దురదృష్టవశాత్తూ పాలసీదారుడు మరణించినా, నామినీకి ఈ పాలసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ తీసుకున్న వారికి కొంతకాలం తర్వాత రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఇది కూడా చదవండి: PF తో ఇలా చేస్తే కోటి రూపాయలు. ఉద్యొగులకి ఇక పండగే LIC జీవన్ లాభ్ పాలసీలో.. రూ.54 లక్షలు రాబడిగా పొందాలనుకుంటే.. బీమా మొత్తం రూ. 20 లక్షలుగా తీసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఏడాదికి రూ. 92 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు దాదాపు రూ. 253 పొదుపు చేయాలి. 25 ఏళ్ల తర్వాత మొచ్యూరిటీ మొత్తం రూ. 54.4 లక్షలుగా ఉంటుంది. జీవన్ లాభ్ పాలసీ కింద పెట్టుబడి పెట్టేవారు నెలవారీగా లేదా మూడు నెలలకు లేదా ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి తమతమ ప్రీమియంలను చెల్లించవచ్చు. నెలవారీ చెల్లింపులపై 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 8 నుంచి 59 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 3 రకాలుగా ఉంటుంది. 25 ఏళ్లు టర్మ్ ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 21 ఏళ్లు టర్మ్ ఎంచుకుంటే.. 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అదే 16 ఏళ్లు టర్మ్ అయితే 10 ఏళ్లు ప్రీమియం కట్టాలి. పాలసీదారుడికి పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత బీమా మొత్తం, బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్ వంటివి లభిస్తాయి. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. అప్పుడు నామినీకి బీమా డబ్బులు అందజేస్తారు. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. pic.twitter.com/X53LsCFzP2 — Govardhan Reddy (@gova3555) July 11, 2022 ఇది కూడా చదవండి: Business: ఈ బిజినెస్ తో సొంత ఊర్లోనే నెలకు రూ.50వేల ఆదాయం!